కొంత మంది డైరెక్టర్లకు.. కొందరు హీరోయిన్లకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వీటిని ఎవరూ కాదనలేదు. వాస్తవానికి ఒక సినిమాలో హీరో.. హీరోయిన్లు కలిసి నటించినంత మాత్రాన.. వారి మధ్య కెమి స్ట్రీ పండాలని లేదు. కానీ, వారిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్‌తో కెమిస్ట్రీ కుదిరే పరిస్థితి ఉండొచ్చు. ఇలా.. ఓల్డ్ మూ వీల్లో దర్శకులతో హీరోయిన్లకు ఎఫెయిర్లు ఉండేవని అంటారు.
ఎందుకంటే.. ఇప్పుడు హీరోలు రారాజులు. కానీ, 1970-1990ల మధ్య కాలంలో దర్శకులదే హవా. వారు ఎంపి క చేసిన వారే హీరోయిన్. వారు చెప్పిన వారే హీరో. సో.. ఇలా ఒక దశలో దర్శకులు చెలరేగిపోయారు. ముఖ్యంగా అప్పటి దర్శకుల్లో బాలచందర్ కీలకంగా ఎదిగారు. తమిళనాడుకు చెందిన బాలచందర్.. చాలా మంది హీరోయిన్లను పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన చాలా మంది అనతి కాలంలో నే ఎదిగిపోయారు.
సరిత, ముచ్చుర్ల అరుణ.. మాధవి.. ఇలా అనేక మంది ఉన్నారు. వీరంతా కూడా తర్వాత నటనా పరంగా టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. ఆయన ఎవరిని పరిచయం చేసినా.. వారిలో టాలెంట్ ఉంటేనే పరిచయం చేస్తారని అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే! బాలచందర్ స్టయిలే వేరు. ఆయన స్కూలే వేరు. ఆయన ఎవరినైనా ఎంపిక చేశారంటే.. వారికి పూర్తి శిక్షణ ఆయనే ఇస్తారు. స్వయంగా ఆయనే నడక నేర్పిస్తారు. అసలు ఆయన సినిమాల్లో హీరోయిన్లకు శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా చాలా స్పెషల్‌గా ఉండేదని అంటారు.
ఒక్కసారి ఆయన చేతిలో పడ్డాక ఎలాంటి హీరోయిన్ అయినా నటనలో రాటుదేలిపోయి టాప్ హీరోయిన్, టాలెంటెడ్ హీరోయిన్ అయిపోతుందనే అంటారు. అన్నీ వచ్చినవాళ్లు చేయడం గొప్పేముంది.. అనే బాలచందర్ స్కూల్ నుంచి వందల మంది నటీనటులు వచ్చారు. అందుకే.. బాలచందర్ దర్శకత్వంలో చేసేందుకు హీరోయిన్లు ఎగబడిపోతుం టారు. అందుకే ఆయనంటే పడిచచ్చిపోతారు కూడా..!