టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ తో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ..ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడు . మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో హైయెస్ట్ పారితోషకం తీసుకుంటున్న హీరోగా రికార్డ్ నెలకొల్పిన బన్నీ.. ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు .
పుష్ప 2 సినిమా అయిపోగానే పలు బడా డైరెక్టర్స్ తో కమిట్ అయిన బన్ని.. అవి కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. అంతకు డబల్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆయన భార్య స్నేహారెడ్డి దూసుకుపోతుంది . నిరంతరం ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బన్నీ భార్య చాలా యాక్టీవ్ గా ఉంటుంది . అయితే రీసెంట్గా బన్నిని స్నేహ రెడ్డి బాధపడుతుంది అంటూ న్యూస్ హల్ చల్ చేస్తుంది .
సోషల్ మీడియాలో బన్నీ భార్య ఏ పోస్ట్ పెట్టిన దానికి వల్గర్ కామెంట్స్ పెడుతున్నారని.. ఆమె ఫొటోస్ పై మరీ దారుణంగా మాట్లాడుతున్నారని.. ఈ క్రమంలోనే బన్నీ – స్నేహారెడ్డి ఫోటోషూట్స్ ఆపేయమంటూ సలహా ఇచ్చారని ..కానీ మొదటి నుంచి ప్యాషన్ గల వ్యక్తి స్నేహ ఒకరి మాటలను పట్టించుకోను అంటూ బన్నీకి తెగేసి చెప్పిందట. ఈ క్రమంలోనే అలాంటి కామెంట్స్ విని బన్నీ బాధపడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు బన్ని అంటే పడని యాంటి మెగా ఫ్యాన్స్ ఇలా ఈ జంట మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఎవరు ఎన్ని చేసినా మా అన్న – వదిన ఎప్పటికీ కలిసే ఉంటారు ..టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రొమాంటిక్ పెయిర్ ఇది అంటూ చెప్పుకొస్తున్నారు..!!