MoviesRajamouli డైరెక్టర్ రాజమౌళి చేత కంటతడి పెట్టించిన స్క్రిప్ట్ ఇదే.. ఎంత...

Rajamouli డైరెక్టర్ రాజమౌళి చేత కంటతడి పెట్టించిన స్క్రిప్ట్ ఇదే.. ఎంత స్పెషలంటే..?

ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎవరు అయ్యా అంటే కళ్ళు మూసుకొని నిద్రలో లేపిన టక్కున చెప్పే పేరు రాజమౌళి . చిన్న డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు దర్శకధీరుడుగా మారిపోయారు . ప్రపంచ దేశాలలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా నిలిచాడు . దానికి మెయిన్ రీజన్ బాహుబలి అనే చెప్పాలి . ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత రేంజ్ లో తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా చేసుకున్నాడు .

కాగ ఆర్ఆర్ఆర్ సినిమా పై పలువురు హాలీవుడ్ డైరెక్టర్ లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే . రీసెంట్గా రాజమౌళి అంతర్జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన తండ్రి రాసిన స్క్రిప్ట్ చదివి ఏద్చేశానని ఓపెన్ గా చెప్పేశారు . రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) అనే స్క్రిప్ట్ రాస్తున్నారు .

ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి తనకు పెద్దగా అవగాహన లేదని ..దీని గురించి ఆయనకు ఏమీ తెలియదని ..కానీ ఈ సమస్త ఎలా ఏర్పడింది..? వారి నమ్మకాలు ఏంటి ..?దానిని ఎలా అభివృద్ధి చేస్తున్నారు ..?దానికోసం ఎంత కష్టపడుతున్నారు ..?అనే అంశాలు తెలుసుకొని ఎమోషనల్ గా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని ఓ రోజు ఆ స్క్రిప్ట్ చదివిన రాజమౌళి ఎమోషనల్ అవుతూ తెలియకుండానే ఏడ్చేసాడట. ఆస్క్రిప్ట్ చదివిన తర్వాత నన్ను చాలా భావోద్వేగానికి గురి చేసిందని రాజమౌళి చెప్పారు. ఈ సందర్భంగా ఈ స్క్రిప్ట్ సమాజానికి ఏం చూపిస్తుందో తెలియదు కానీ తను మాత్రం ఎమోషనల్ గా టచ్ చేసిందని రాజమౌళి చెప్పడం సంచలనంగా మారింది ..ప్రజెంట్ రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news