కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రీసెంట్ గా నటించిన సినిమా “సార్”. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ నమోదు చేసుకుంది . రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్స్ సాధించిన సార్ సినిమా.. థియేటర్స్ లో ఇంకా సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా సార్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్ . ఈ క్రమంలోని సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్టేజిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది పలు సినిమాల్లో తనదైన స్టైల్ లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే హైపర్ ఆది సార్ సినిమాలో ..ధనుష్ ఫ్రెండ్ గా .. లెక్చరర్ గా నటించి మెప్పించాడు . కాగా ఈ సినిమా ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ..” ఈ సినిమా చూశాక మా సుబ్రహ్మణ్యం మాస్టర్ కి నేను ఫోన్ చేసి క్షమాపణ చెప్పానని చెప్పుకొచ్చాడు . సుబ్రహ్మణ్యం స్వామి ఆ రోజుల్లో నేను చాలా ఇబ్బంది పెట్టానని ..ఆ విషయాలు గుర్తు చేసుకున్న ఆయన..నేను ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే .. క్షమించమని ఫోన్ చేసి డైరెక్ట్ గా అడిగానని ” చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఆయన అప్పుడే కాదురా నువ్వు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నవ్..ఈ టైం లోన రా ఫోన్ చేసేది ” అంటూ మాట్లాడడాని సరదాగా చెప్పుకొచ్చాడు . హైపర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సార్ సినిమా మొత్తం నేటి విద్యా వ్యవస్థ పై డిపెండ్ అవుతూ తీసిన సినిమా . వెంకీ అట్లూరి విద్య కి ఉన్న గొప్పతనాన్ని చాలా క్లియర్ గా చూపించారు. ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఆర్ నారాయణ మూర్తి వచ్చి డైరెక్టర్ ని..హీరో ధనుష్ ని ప్రత్యేకంగా కొనియాడారు..!!