MoviesPrabhas కెరీర్ లోనే ఫస్ట్ టైం..ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో...

Prabhas కెరీర్ లోనే ఫస్ట్ టైం..ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్న ప్రభాస్..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..ఫస్ట్ టైం తన కెరియర్లో భారీ ప్రాజెక్టులో గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ తను నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కే విధంగా ప్లాన్ చూసుకుంటున్నారు . నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ కె”..ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్”.. గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

కాగా ఎవ్వరు ఊహించిన విధంగా మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ సినిమాకి కమిట్ అయిన ప్రభాస్ ..ఇప్పుడు అభిమానులకి మరోసారి బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వం నటిస్తున్న సూర్య ..1000ఏళ్ళ నాటి పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హాట్ ఐటెం బాంబ్ దిషా పటానీ..క్లాస్ హీరో సూర్యకు జోడీగా నటించబోతోంది. #సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

ఎపిక్ యాక్షన్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాలో ..సూర్య ఏకంగా 5 డిఫరెంట్ పాత్రలలో కనిపించనున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మొత్తానికి కర్త — కర్మ క్రియ అన్ని తానై సూర్య ఉండబోతున్నారు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే సినిమాలో కీలక పాత్ర కోసం ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారట టీం. కేవలం పది నిమిషాల పాత్ర అయినా కానీ సినిమాని మలుపు తిప్పే పాత్ర ప్రభాస్ ది అంటూ తెలుస్తుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news