టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఎంత మజాగా ఉంటుందో గత కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నాం. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉంటాయి. దీనికి తోడు థియేటర్ల గొడవలు తెలిసిందే.
2020లో సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు బన్నీ – మహేష్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది.
ఈ క్రమంలోనే 2024 సంక్రాంతి పోటీ కూడా అప్పుడే వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఈ పోటీలోకి ప్రభాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే వస్తుందని ఈ రోజు అధికారికంగా ప్రకటించేశారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతోందని చెప్పేశారు. ఈ ప్రకటనే ఇప్పుడు టాలీవుడ్లో మరో రచ్చకు తెరలేపింది. దిల్ రాజు నిర్మిస్తోన్న రామ్‌చరణ్, శంకర్ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో దించే ప్లానింగ్‌లో ఉన్నారు.
అసలే ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల మధ్యలో తన వారసుడును రిలీజ్ చేయడం ఎంత పెద్ద రచ్చకు దారితీసిందో చూశాం. ఇక పుష్ప 2 సినిమాను కూడా వచ్చే సంక్రాంతి బరిలోనే దించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బావ, బావమరుదులు ఇద్దరూ సంక్రాంతిని కుమ్మేసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు.
ఎప్పుడు అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ సంక్రాంతికి వేశారో ఇప్పుడు అందరి గుండెళ్లో రైళ్లు పరిగెట్టేస్తున్నాయి. ఎంత శంకర్, రామ్‌చరణ్ సినిమా అయినా.. దిల్ రాజు నిర్మాత అయినా.. ఇటు పుష్ప పాన్ ఇండియా హిట్ అయ్యి.. పుష్ప 2 వస్తున్నా .. ఈ రెండు సినిమాల కంటే ప్రభాస్ కే మీదే లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి.
వైజయంతీ మూవీస్ బ్యానర్, ప్రభాస్ క్రేజ్.. నాగ్ అశ్విన్ పర్ఫెక్షన్ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం.. పైగా 2050 కాలంలో ప్రపంచం ఎలా ఉంటుందన్న నేపథ్యంతో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ వేసిన వెంటనే పుష్ప 2, దిల్ రాజుకు ఎక్కడో టెన్షన్ స్టార్ట్ అయిపోయిందనే అంటున్నారు. ప్రాజెక్ట్ కే క్లిక్ అయితే అసలు పుష్ప 2, శంకర్ – చరణ్ సినిమాల్లో ఏదీ పోటీ ఇచ్చే పరిస్థితే ఉండదని ట్రేడ్ టాక్ ?