నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో తన కెరీర్ లోనే సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. బాలయ్య ఎన్టీఆర్ నటవారసుడిగా తాతమ్మకల సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. కెరీర్ ప్రారంభంలో బాలయ్యకు మంచి హిట్లు పడ్డాయి. ఆ తరంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ తర్వాత జానపద – పౌరాణిక – చారిత్రాత్మక – సాంఘిక పాత్రలు చేయాలంటే బాలయ్యకు మాత్రమే సాధ్యమవుతుంది. అంత గొప్పగా అలరించాడు బాలయ్య.
మంగమ్మగారి మనవడు సూపర్ హిట్ అవడంతో బాలయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. అక్కడి నుంచి ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు సినిమాలు బాలయ్య చరిత్రను ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా లిఖించాయి. అయితే బాలయ్యకు మధ్యలో చాలా ప్లాపులు పడ్డాయి. 2004 సంక్రాంతికి వచ్చిన లక్ష్మీనరసింహ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2010 ఏప్రిల్ 30న సింహ సినిమా వచ్చేంతవరకు ఆరు సంవత్సరాల పాటు బాలయ్యకు సరైన హిట్ పడలేదు.
మధ్యలో మిత్రుడు లాంటి మంచి సినిమాలు పడినా అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. వరుస ప్లాపులతో పాటు కొన్ని ఘోర పరాజయాలతో బాలకృష్ణ పని అయిపోయిందన్న విమర్శలు వచ్చాయి. 1980 టైంలో అయితే ఒకే ఏడాది వరుసగా ఆరు సూపర్ హిట్లు కొట్టిన ట్రాక్ రికార్డు బాలయ్య పేరిట ఉంది. అసలు ఆ రికార్డును ఇప్పటికీ ఏ స్టార్ హీరో కూడా దాటాలేకపోయాడు. ఆ తర్వాత బాలయ్య వరుసగా రెండు సూపర్ హిట్లు ఇచ్చిన మూడో సినిమా ప్లాప్ అవడంతో హ్యాట్రిక్ అన్న పదానికి బాలయ్య ఇటీవల కాలంలో పూర్తిగా దూరమైపోయాడు.
కట్ చేస్తే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలయ్యకు తన కెరీర్లో అద్భుతమైన మ్యాజిక్ రిపీట్ చేసే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇదే ఆసక్తిగా మారింది. అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్టులతో బాలయ్య మంచి ఫామ్ లో ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ కోణంలో చూస్తే బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అని చెప్పాలి. అఖండ బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
అయితే వీర సింహారెడ్డి యావరేజ్ టాక్‌తో కూడా అఖండ వసూళ్లను అధిగమించేసింది. వీర సింహారెడ్డి ఏకంగా ఫస్ట్ డే రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా హిట్ అయితే బాలయ్యకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆయన కెరీర్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టినట్టు అవుతుంది. బాలయ్య అభిమానులు కూడా అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్, బాలయ్య ట్రాక్ రికార్డు కంపేరిజన్ చేసి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న ఆశలతో ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి – బాలయ్య సినిమా వచ్చే ఆగస్టు లేదా దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.