టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ హ్యాపీడేస్ సినిమాతో మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుంది . అంతెందుకు రీసెంట్గా వచ్చిన కృతి శెట్టి , శ్రీలీల లాంటి కుర్ర బ్యూటీలకు తన అందంతో గట్టి కాంపిటీషన్ ఇస్తుంది ..ఇలాంటి ముద్దుగుమ్మను మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అంటూ జనాలు సైతం కామెంట్స్ చేస్తున్నారు .
అంతలా తన క్రేజ్ ను.. రేంజ్ ను ..ఫాన్ ఫాలోయింగ్ పెంచుకున్న తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది అంటూ రీసెంట్ గా బయటపడింది . న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళిద్దరూ చేసిన గాటు లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది. రీసెంట్ గా తమన్నా.. హిమాలయాలకు వెళ్లి అక్కడ వైష్ణవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు . ఈ సందర్భంగా తమన్న కాషాయ వస్త్రాలు ధరించి అక్కడ పూజలు చేసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు .
“ఓ ఆహ్వానం మీదకే ఇలా హిమాలయాలకు వచ్చాను.. ఇక్కడ లింగభరవి దేవి ఆలయాన్ని సందర్శించాను.. పూజలు చేశాను.. చాలా ప్రశాంతంగా అనిపించింది.. జీవితం, మరణం ,అపజయాలు పట్ల నెలకొన్న భయాలు అన్ని పోయాయి.. అందరూ చెప్పినట్లే లింగ బైరవి దేవి చాలా శక్తివంతమైనది..ఇలా దర్శించుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.. లింగభరవి దేవివిగ్రహం నా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది “అంటూ చెప్పుకొచ్చారు . ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే రజనీకాంత్ తో జైలర్ సినిమాలో ..చిరంజీవి పక్కన భోలా శంకర్.. దిలీప్ పక్కన బాంద్రా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది..!!