Moviesసాయిప‌ల్ల‌విని తొక్కేయాల‌ని కుట్ర ప‌న్నిన సినిమా పెద్ద‌లెవ‌రు..ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డిన నిజం..!

సాయిప‌ల్ల‌విని తొక్కేయాల‌ని కుట్ర ప‌న్నిన సినిమా పెద్ద‌లెవ‌రు..ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డిన నిజం..!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని బాగానే ట్రోల్ చేశారని తను అప్పుడప్పుడు ఓపెన్ అయ్యే విధానాన్నిబట్టి అర్థమవుతోంది. ఫిదా సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా బ్యూటీగా పాపులారిటీని తెచ్చుకుంది. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడానికే ఆరాటపడతారు. కానీ, నేచురల్ పర్ఫార్మర్‌గా మాత్రం చాలా తక్కువమంది పేరు తెచ్చుకోవడానికి తాపత్రయపడతారు.

కొన్నేళ్ళపాటు గుర్తుండిపోయే సినిమాలు చేయాలని..వాటి గురించి జనాలు మాట్లాడుకుంటుంటే ఆనందపడాలనుకునేవారు అతికొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఎంతసేపటికీ తనని మంచి నటి, పర్ఫార్మర్ అని చెబుతుంటే సంతోషపడుతుంది. అద్భుతమిన డాన్సర్ అంటే పొంగిపోతుంది. అంతేకాని, మా సినిమాలో ఎక్స్‌ఫోజింగ్ చేయాలి, హీరోతో లిప్ కిస్ పెట్టాలి..బెడ్రూం సీన్స్‌లో నటించాలంటే మాత్రం నమస్తే.. అంటూ ప్రాజెక్ట్‌ను వదిలేస్తుంది.

అయినా కూడా సాయి పల్లవిని అన్నీ రకాలుగా ట్రై చేసిన వారున్నారట. అంతేకాదు, తన హైట్..మొహం మీద మొటిమల గురించి కామెంట్స్ చేసిన వారు..ఇక్కడ ఎదగకుండా చేయాలని చాలామంది క్రిటిసైజ్ కూడా చేశాట. డాన్స్ పర్ఫార్మెన్స్‌లో కాస్త కాస్ట్యూం చిన్నది వేసుకుంటే తొడలపైనే చూస్తూ ఇబ్బంది పెట్టినవారూ చాలమంది ఉన్నారని కొన్ని టాక్ షోలలో చెప్పి తన బాధను వ్యక్త పరిచింది.

ఇప్పుడు కూడా నిజం విత్ స్మిత అనే టాక్ షోలో తను ఎలాంటి మానసిక హింసని గురైందో..ఎంతమంది వల్ల క్రిటిసిజంకి గురైందో తెలిపింది. ఇండస్ట్రీలో కలిసి కాసేపు గడుపుదామా అని అడగడం కూడా చాలా స్టైల్‌గా ఉంటుందని సన్నిహితుల వద్ద చెప్పి వాపోయిందట. అడుగడుగా ఇలాంటి వారు తారసపడతారు.

మనకి నచ్చితే ఎవరితోనైనా ట్రావెల్ చేస్తాము. లేదంటే కట్ చేస్తాము. అలా కట్ చేయడం వల్లే తొక్కేయడానికి రెడీ అవుతారని..అయితే, నాకు సినిమా ఒక్కటే కాదు..ఇంకే పని చేసుకొనైనా బ్రతకగలను అని క్లారిటీగా చెప్పింది. ఇలా ఉంది కాబట్టే చాలా తక్కువ సినిమాలలో నటిస్తుంది. లేదంటే సాయి పల్లవిని కొట్టినవారు ఆమె దరిదాపుల్లో కూడా ఉండరు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news