సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు .. వాళ్ళు వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇట్టే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బడా సెలబ్రిటీస్ వేసుకునే షర్ట్స్ , ప్యాంట్స్.. వాచెస్ కి సంబంధించిన విషయాలు సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ బాద్షాగా పేరు సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .
ఇప్పటివరకు ఇండియాలో ఈ వాచ్ ను ఎవరు ధరించలేదు .. అంటేనే జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు ఈ వాచ్ లో బోలెడు స్పెషాలిటీస్ ఉన్నాయని ..ఆ కారణంగానే షారుఖ్ ఖాన్ కొన్నాడంటూ తెలుస్తుంది . రీసెంట్ గా ఆయన నటించిన మూవీ “పఠాన్”. షారుక్ ఖాన్ ఏడేళ్ల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు పడిపోతున్న బాలీవుడ్ ను తన సినిమాలతో లేపి దాదాపు 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాడు .
కాగా ఈ సక్సెస్ తో మంచి జోరు మీద ఉన్న షారుఖ్.. రీసెంట్గా ఓ ఈవెంట్ లో మెరిశాడు . అయితే అందరి కళ్ళు షారుక్ ఖాన్ వాచ్ పైనే ఉన్నాయి. ఈ క్రమంలోని షారుక్ ఖాన్ ధరించిన వాచ్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో బ్లాక్ షూట్లో దర్శనమిచ్చిన షారుక్ .. చేతికి బ్లూ కలర్ రిచెస్ట్ వాచ్ ను పెట్టుకున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ఖరీదు 4 కోట్ల 98 లక్షలు..అంటే దాదాపు ఐదు కోట్లు . ఈ విషయం తెలిసి జనాలు ఓఉరా అంటున్నారు . అంతేకాదు ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి వాచ్ ను ఎవరు పెట్టుకోలేదట,, ఫస్ట్ టైం ఇండియాలో కొనుగోలు చేసిన హీరోగా షారుఖ్ ఖాన్ రికార్డు నెలకొల్పాడు..!!