సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు పెళ్లిళ్లు చేసుకోవడం.. విడిపోవడం.. మరొకరితో పెళ్లి చేసుకోవడం కామన్‌గా జరిగే ప్రక్రియ. ఇది ఇప్పటి నుంచే కాదు గత ఆరేడు దశాబ్దాల నుంచి వస్తున్నదే. సీనియర్ నటి జయంతి ఏకంగా ఒకటి రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె మూడో భర్త అయితే జయంతి కంటే వయస్సులో చాలా చిన్నోడు. అయితే భర్త రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఆయనతోనే చాలా రోజులు సంసారం చేయడం అంటే అది ఖచ్చితంగా సెన్షేషనలే.
సీనియర్ నటిమణి కుట్టి పద్మిని జీవితంలో ఇలాంటి ఆసక్తికర సంఘటనే చోటు చేసుకుంది. అంబల అంజులం అనే సినిమాతో మూడేళ్లకే నటీమణిగా ఎంట్రీ ఇచ్చింది పద్మిని. కుళంద్యం దైవమమ్ అనే సినిమాతో ఆమె జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మళాయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.
ఆ తర్వాత ఆమె నిర్మాతగా కూడా మారింది. వైష్ణవి ఫిలింస్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బ్యానర్‌పై సీరియల్స్ నిర్మించింది. తెలుగులో కూడా చిక్కడొ దొరకడు, లేతమనసులు, విచిత్ర కుటుంబం వంటి పలు సీరియల్స్‌తో ఆమె మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అయితే ఆమె తన ప్రేమ, పెళ్లి కథ గురించి ఓ ఆసక్తికర విషయం ఇన్నేళ్లకు అందరితో పంచుకున్నారు. ఆమెకు 23 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమిచి పెళ్లాడారు. అతడు మందుకు బానిస కావడంతో అతడి నుంచి విడిపోయి తర్వాత 10 ఏళ్లకు ప్రభు అనే వ్యక్తితో ఆమె మళ్లీ ప్రేమలో పడ్డారు. అలా ప్రభుతో ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె మొదటి భర్తకు పూట గడవడం కూడా కష్టంగా ఉందన్న విషయం ఆమె కుమార్తె ద్వారా పద్మినికి తెలిసిందట.
దీంతో పద్మిని అతడిని అలా వదిలేయాలని అనిపించలేదని.. అలాగని అతడితో బెడ్ షేర్ చేసుకోవాలని అనిపించలేదని.. అయితే అతడిని ఆదుకోవాలని తాను తన ఇంటి కింద రూం కట్టించడంతో పాటు నెలకు రు. 30 వేల జీతంతో ఓ ఉద్యోగం కూడా కల్పించానని ఆమె తెలిపింది. 12 ఏళ్ల పాటు అతడిని ఓ ఫ్రెండ్‌లా మాతోనే ఉంచుకున్నానని.. గతేడాదే ఆయన చనిపోయాడని పద్మిని చెప్పింది.
ఇక తన రెండో భర్త ప్రభు తన సెక్రటరీతోనే లవ్‌లో పడ్డాడని… తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని.. తాను ఇప్పుడు ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పింది. ఏదైనా మొదటి భర్త విషయంలో పద్మిని చేసిన పనికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే..!