అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే . అందానికి అందం .. నటనకి నటన ..హైట్ కి హైట్.. చిరునవ్వుతో నవ్వితే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే . ఇలాంటి బుట్ట బొమ్మను ప్రతి అబ్బాయి తన లైఫ్ లోకి ఇన్వైట్ చేయడానికి రెడీగా ఉంటారు . అలాంటి ఓ చక్కటి అందాన్ని పద్ధతిని సొంతం చేసుకునింది పూజ హెగ్డే.
కాగా రీసెంట్గా పూజ హెగ్డే బ్రదర్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది . తన బ్రదర్ పెళ్లి వేడుకలను దగ్గరుండి చూసుకున్న పూజ హెగ్డే .. తన సినిమా షెడ్యూల్ సైతం ఆపుకొని మరి ఇంటి బాధ్యతలను తీసుకొని అంగరంగ వైభవంగా తన బ్రదర్ పెళ్లిని జరిపించింది . ఈ క్రమంలోనే పూజ హెగ్డే కట్టుకున్న శారీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలా ట్రెడిషనల్ గా స్టైలిష్ జ్యూవెలరీని పెయిర్ అప్ చేస్తూ పూజ హెగ్డే బుట్ట బొమ్మ లాగా కనిపించింది.
ఈ క్రమంలోనే పూజ హెగ్డే శారీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూజ హెగ్డే కట్టుకున్న ఈశారీ ఆమె గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరో కాదు తన బ్రదర్. ఆ ఇష్టంతోనే పూజా హెగ్డే ఈసారి ను తన బ్రదర్ పెళ్లికి కట్టుకునిందట . కాగా త్వరలోనే పూజ హెగ్డే కూడా పెళ్లి న్యూస్ చెప్పబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ బుట్ట బొమ్మను పెళ్లి చేసుకునే రారాజు ఎక్కడున్నాడో..?