Moviesమళ్లీ జబర్ధస్త్ కి నాగబాబు రీఎంట్రీ.. ఇక షో చూడలేం రా...

మళ్లీ జబర్ధస్త్ కి నాగబాబు రీఎంట్రీ.. ఇక షో చూడలేం రా బాబోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలా సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించిన నాగబాబు .. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . కాగా ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలను ప్రొడ్యూస్ చేసి హిట్లు – ఫ్లాపులతో సరిపెట్టుకున్నాడు . కాగా నాగబాబు అంటే అందరికీ ముందు టక్కున గుర్తొచ్చే పేరు జబర్దస్త్ . ఎవరు ఊహించిన విధంగా మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో కి జడ్జ్ గా వ్యవహరించి షాక్ ఇచ్చారు.

కాకపోతే నిర్విరామంగా జబర్దస్త్ షో కి జడ్జిగా చేసిన నాగబాబు .. సడన్ గా ఈ షో నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోని రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ నాగబాబు రీసెంట్గా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నిజాలని బయట పెట్టాడు. నాగబాబు మాట్లాడుతూ ..”జబర్దస్త్ షో నుంచి నా ఇష్టపూర్వకంగానే బయటకు వచ్చాను . ఎవరు నన్ను బలవంతంగా పంపించలేదు. నాకు షో వాళ్లతో గొడవలు కాలేదు .

నాకు మల్లెమాల హెడ్ శాంప్రసాద్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు. అలాగే ఈటీవీ వారితోనే ఎటువంటి విభేదాలు లేవు. మేనేజర్ స్థాయి ఉద్యోగులు చేసిన అతి ఆటిట్యూడ్ కారణంగానే నేను షో నుంచి తప్పుకున్నాను . వాళ్ళు చేసే అతి నాకు నచ్చక దానివల్ల నేను ఇబ్బంది పడిన కారణంగానే వాళ్లతో ఇమడలేకపోయాను” అని చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే హోస్ట్ నుంచి జబర్దస్త్ కి మళ్ళీ మీరు ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు..” నా ఇష్టపూర్వకంగానే వచ్చేసాను. నా ఇష్టపూర్వకంగా మళ్ళీ వెళ్ళను ..ఒకవేళ నిర్వాహకులు మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి నుంచి పిలుపు వస్తే మాత్రం వెళ్లడానికి ఆలోచిస్తాను ..అభ్యంతరమైతే నాకు ఏమీ లేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు నాగబాబు . ఈ క్రమంలోనే యాంటీ మెగా ఫాన్స్ నాగబాబు జబర్దస్త్ షోకు వస్తే ఇక చూడలేము అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news