కే జి ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇంత దిగజారి పోయిందా ..? అంటే అవునని అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ కోసం మంచి మంచి ఆఫర్స్ ని వదులుకుందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కే జి ఎఫ్ సిరీస్ తో పాపులారిటీ దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే అమ్మడు చేసింది మూడే మూడు సినిమాలు. అందులో రెండు కేజీ అఫ్ సిరీస్లు. ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ బస్టర్ హిట్సే.
ఇక తర్వాత నటించిన కోబ్రా హిట్ అయినా అమ్మడు పేరు వినిపించలేకపోయింది. కాగా ఈ క్రమంలోనే కేజిఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ ఎందుకు ఖాళీగా ఉంటుందా ..? అని ఆరా తీస్తున్నారు జనాలు . అయితే రెమ్యూనరేషన్ వ్యామోహంలో వచ్చిన మంచి మంచి ఆఫర్స్ ను వదులుకునేసింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. కాగా ప్రజెంట్ శ్రీనిధి శెట్టి ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకటేష్ నెక్స్ట్ నటిస్తున్న సైంధవ అనే సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది.
నిజానికి అలాంటి సీనియర్ హీరో సినిమాలో నటించే కర్మ శ్రీనిధికి లేదు. కెజీఎఫ్ సిరిస్ లాంటి బిగ్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ చరణ్, తారక్ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించాల్సిన ఈ బ్యూటీ ఆఖరికి డబ్బులు డబ్బులు అంటూ చివరికి వచ్చిన ఆఫర్లు అని వదులుకుని..ఆఖరికి సీనియర్ హీరో సినిమాలకి కమిట్ అవ్వాల్సిన పరిస్ధితి తెచ్చుకుంది..!!