టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వకపోయినా కెరీర్ తొలినాళ్లలో మాత్రం కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశాలను ఇచ్చారు. రాజమౌళి, వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతోనే ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. తారక్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది.
తారక్ వినాయక్ కాంబినేషన్ లో ఆది సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన దర్శకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలతో సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, మల్లిడి వశిష్ట దర్శకులుగా కెరీర్ ను మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డి కాంబోలో అతనొక్కడే సినిమా తెరకెక్కింది.
కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కాంబోలో పటాస్ సినిమా తెరకెక్కగా కళ్యాణ్ రామ్ మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో బింబిసార తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ తర్వాత మూవీ అమిగోస్ కు కూడా కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి పని చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలతో పరిచయమైన డైరెక్టర్లు కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నిఖిల్ సుధీర్ వర్మ కాంబోలో స్వామిరారా, నిఖిల్ చందు మొండేటి కాంబోలో కార్తికేయ సినిమా తెరకెక్కింది.
నిఖిల్ సినిమాలతోనే ఈ ఇద్దరు డైరెక్టర్లు దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ సాధించారు. ఈ దర్శకులకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. శర్వానంద్ సుజీత్ కాంబోలో రన్ రాజా రన్ తెరకెక్కగా ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమైన సుజీత్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నిఖిల్, శర్వానంద్ సినిమాలతో పరిచయమైన దర్శకులలో మెజారిటీ దర్శకులు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తుండటంతో ఈ హీరోలు లక్కీ హీరోలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ హీరోల సినిమాలతో పరిచయమైతే తమ కెరీర్ బాగుంటుందని కొత్త దర్శకులు భావిస్తున్నారు.