ఎన్టీఆర్-భానుమతి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయి. మల్లీశ్వరి సినిమా సూపర్ హిట్ అయిన విష యం తెలిసిందే. తర్వాత బొబ్బిలి యుద్ధం, పల్నాటి చరిత్ర, మహామంత్రి తిమ్మరుసు.. వంటి అనేక హిట్ సినిమాలు వచ్చాయి. వాస్తవానికి భానుమతి అంటే.. ఫైర్ బ్రాండ్. పైగా.. అడపాదడపా మాట్లాడతామంటే అస్సలే కుదరదు. తూకం వేసినట్టు మాట్లాడాలి. అలానే వ్యవహరించాలి.
అందుకే భానమతి అంటే.. పెద్దగా ఎవరూ ఆమెతో నటించేందుకు ముందుకు వచ్చేవారు కాదు. అంతేకా దు, ఆమె అంటేనే జంకేవారు. అయితే, అక్కినేని, ఎన్టీఆర్‌లు మాత్రం.. భానుమతితో కలిసి నటించిన అనేక చిత్రాలు వంద రోజుల పండుగ చేసుకున్నాయి. ఇలాంటి వాటిలో అన్నగారి 100వ సినిమా.. అది కూడా భానుమతితో కలిసి నటించిన సినిమా కావడం గమనార్హం. అదే `సారంగధర`
అప్పట్లో జరిగిన కథలు, నాటకాలు.. లేదా నవలలు ఆధారంగా సినిమాలు తెరకెక్కించేవారు కదా! ఇది కూ డా అలానే తెరకెక్కింది. సారంగధర ఒక నాటకం. ఇది ప్రజల్లో బాగా ఫేమస్ అయింది. అయినప్పటికీ.. దీనికి కొన్ని తళుకులు అద్ది.. సినిమాగా తీశారు. ఈ సినిమా కథ కూడా చిత్రంగా ఉంటుంది. హీరో హీరోయి న్లయిన భానుమతి, రామారావుల మధ్య ఘాటైన సంభాషణలు కూడా ఉన్నాయి.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. హీరోగా ఉన్న రామారావును భానుమతి ప్రేమిస్తుంది. అయితే.. ఈ విషయం హీ రోకు తెలిసేలోగానే.. హీరో తండ్రిని ఆమె పెళ్లిచేసుకునే పరిస్థితి వస్తుంది. అనంతరం కూడా హీరో వెంట పడుతుంది. చివరకు ఇది ఏ మలుపు తిరుగుతుందనేది కథ. కొంత సస్పెన్స్‌తో కూడుకున్న ఈ సినిమాలో భానుమతి, రామారావు నటించిన తీరు నభూతో అనే చెప్పాలి. మల్లీశ్వరిలో ఒకరకమైన పేరు వస్తే.. సారంగధరలో ఇద్దరికీ మరో గుర్తింపు రావడం గమనార్హం.