సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం ..కామన్ గా మారిపోయింది . ఓ విషయం జరిగినప్పుడు స్టార్ హీరో ట్విట్ చేసినా.. చేయకపోయినా సోషల్ మీడియాలో ఏకీపారేసే జనాలు.. ఏదైనా కాంట్రవర్షీయల్ మ్యాటర్ దొరికితే మాత్రం దానిని 10 రకాలుగా ట్రోల్ చేస్తూ ఆ హీరోని డౌన్ చేయడానికి చూస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య పై పడి ఏడ్చే కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ ఫోటోని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫోటో ఇదే.
ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న పిక్ ను ఇప్పుడు కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ వీర సింహారెడ్డి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం అంటూ తెలుస్తుంది సినిమాల్లో బాలయ్యతో ఆడి పాడి అలరించిన హనీ రోజ్..బాలయ్య డ్రింక్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సరదాగా బాలయ్య డ్రింక్ చేసినప్పటికీ ..కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలయ్యను కావాలనే ట్రోల్ చేస్తూ బాలయ్య పై లేనిపోని రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు .
నిజానికి ఈ ఫోటో చాలా సరదాగా తీసుకున్నది. బాలయ్య కాదు ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్ హీరోలు కూడా మందు తాగుతారు. అలా అని మందు తాగిన ప్రతివాడు తప్పు చేసినట్లు కాదు కదా ..? ఈ విషయం అర్థం చేసుకొని కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ హనీ రోజ్ కు- బాలయ్యకు ముడిపెడుతూ చెత్త రూమర్ లను క్రియేట్ చేస్తున్నారు . అయితే ఈ ఫోటో చాలా క్యాజువల్ గా.. ఫ్రెండ్లీగా.. సరదాగా తీసుకున్నది అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకనైనా ఈ విషయం అర్థం చేసుకొని సో కాల్డ్ దద్దమ్మ బ్యాచ్ ఆ పిక్ ని ట్రోల్ చేయకుండా సైలెంట్ గా ఉంటే బెటర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ వార్న్ చేస్తున్నారు..!!