Moviesసమంత అభిమానులకు బిగ్ షాక్.. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన నాగ...

సమంత అభిమానులకు బిగ్ షాక్.. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన నాగ చైతన్య..!?

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ టైంలోనే వీళ్ళ మనసులు కలిసాయి . ఇక మెల్ల మెల్లగా అది ప్రేమకు దారితీసి ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా కొన్నాళ్లు ప్రేమించుకుని ఫైనల్లీ ఇంట్లోని పెద్దలకు చెప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కొన్నాళ్లు బాగానే సాగిన వీళ్ళ కాపురంలో కలతలు మొదలయ్యాయి .

దీంతో విడాకులు తీసుకుని దూర దూరంగా ఉంటున్నారు . అయితే సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడే స్టార్ డైరెక్టర్ కు కలిసి సినిమా చేస్తామంటూ అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేశారు నాగచైతన్య – సమంత . ఆమె మరెవరో కాదు నందిని రెడ్డి. సమంత కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ బేబీ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకురాలు . ఈ సినిమా షూటింగ్ టైంలోనే సమంత నాగచైతన్య ఆమెకు కలిసి ఓ సినిమా చేస్తామంటూ అగ్రిమెంట్ పేపర్లు పై సైన్ చేశారట . అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ జంట విడాకులు తీసుకోవడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది .

దీంతో ఈ సినిమా కోసమైనా ఈ జంట మళ్ళీ తెరపై కనిపిస్తారు అంటూ ఆశపడిన అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. రీసెంట్గా నాగచైతన్య నందిని రెడ్డితో చేసిన అగ్రిమెంట్ ని లీగల్ గా క్యాన్సిల్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. సమంతతో నటించడం ఇష్టం లేకనే నాగచైతన్య ఇలా చేశాడంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే సమంతకి కూడా నాగచైతన్యత నటించడం ఏమాత్రం ఇష్టం లేదని.. కానీ నందిని రెడ్డితో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఇంతవరకు ఆ ప్రాజెక్టుపై ముందడుగు వేయలేదని.. ఇప్పుడు నాగచైతన్య క్యాన్సిల్ చేయడంతో సమంత సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిందని అంటున్నారు జనాలు . ఏది ఏమైనా సరే ఇక ఈ జంట కల్వరు అన్నది మాత్రం జనాలకు అర్థమయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news