తెలుగులో ఓటీటీ టాక్ షోను ఓ స్టార్ హీరో హోస్ట్ చేయడం అంటేనే పెద్ద సంచలనం. అలాంటిది బాలయ్య లాంటి హీరో టాక్ షో చేయడం అంటే అది మామూలు సంచలనం కాదు. అసలు బాలయ్య గురించి బయట విన్నవాళ్లకు ఆయన టాక్ షో టాకిల్ చేసే తీరు చూసి మతులుపోతున్నాయి. ఇప్పటికే ఆహాలో వస్తోన్న అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సూపర్ బ్లాక్‌బస్టర్ హిట్. ఇక ఇప్పుడు రెండో సీజన్ కూడా అంతే బ్లాక్‌బస్టర్ అయ్యింది.
రెండో సీజన్‌కు అనుకున్న స్థాయి గెస్టులు తగల్లేదు కాని.. లేకపోతే ప్రతి ఎపిసోడ్ కూడా ఓ రేంజ్లో ఉండేది. ఫస్ట్ సీజన్ స్ట్రీమింగ్ అయినప్పుడు అఖండ సినిమాతో బాలయ్య ఊపేశాడు. ఇప్పుడు రెండో సీజన్ వచ్చినప్పుడు వీరసింహారెడ్డితో బాలయ్య బుల్లితెర, వెండితెరను షేక్ చేసిపడేశాడు. ఇక రెండో సీజన్లో చాలా ఎపిసోడ్లు బాగా పేలాయి. అందులోనూ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో చేసిన రెండు ఎపిసోడ్ల దెబ్బతో ఆహా సర్వరే క్రాష్ అయ్యింది.
ఇక ఇప్పుడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్కు ముహూర్తం రెడీ అయ్యింది. అసలు ఈ ఎపిసోడ్ ఉందన్న ప్రకటన వచ్చిన వెంటనే ఒక్కసారిగా మాసీవ్ హైప్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ టీజర్‌కు ట్విట్టర్లో అదిరిపోయే లైకులు, ట్వీట్లు పడ్డాయి. యూట్యూబ్‌లో అయితే 30 లక్షలకు పైగా వ్యూస్‌తో పాటు 2.5 లక్షల లైకులు వచ్చాయి.
దీనిని బట్టే ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్లో వెయిటింగ్లో ఉన్నారో తెలుస్తోంది. టీజర్లోనే బాలయ్య అదిరిపోయే ప్రశ్నలతో పవన్‌పై ఎటాక్ చేసినట్టుగా ఉంది. తనను బాల అని పిలవమని అడగడం, గతాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ వదినకు కాల్ చేసి సినిమాలు మానేస్తానని చెప్పడం, చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ? వద్దనుకున్నవేంటి ? అన్న ప్రశ్నతో పాటు టీజర్‌కే హైలెట్‌గా నిలిచిన ప్రశ్న కూడా ఉంది.
నీ అభిమాని కానోడు ఎవ్వడూ లేడు.. మరి దానిని ఓటు బ్యాంకుగా ? ఎందుకు కన్వర్ట్ చేసుకోలేదన్న ప్రశ్న బాగుంది. ఏదేమైనా ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సాలిడ్ ఎపిసోడ్లో ఆహాలో త్వరలోనే స్ట్రీమింగ్కు రానుంది. ప్రశాంత్ వర్మ ఈ హిట్‌ను షోను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.