Moviesరాజమౌళి సినిమాలల్లో రమాకు నచ్చని మూవీ ఇదే..అందరి ముందే పరువు తీసేసిందిగా..!!

రాజమౌళి సినిమాలల్లో రమాకు నచ్చని మూవీ ఇదే..అందరి ముందే పరువు తీసేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసేలా చేసిన దర్శకుడు రాజమౌళి అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలకే కాదు రాజకీయ నేతలకు బడా బడా సెలబ్రిటీలకు అదో తెలియని ప్రత్యేకమైన గౌరవం . ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ దేశాలు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు .. అంటే దానికి ఏకైక రీజన్ రాజమౌళి అని చెప్పక తప్పదు . కాగా రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి.. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్గా ప్రతిష్టాత్మకమైన అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకొని మరో సంచలనాన్ని సృష్టించాడు.

కాగా ఇలాంటి తరుణంలోనే తన విజయంలో సగభాగం సక్సెస్ ని భార్యకిచ్చే రాజమౌళి పై ఆయన భార్య రమా రాజమౌళి ఊహించని కామెంట్స్ చేసింది . గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి డైరెక్షన్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమా రాజమౌళి ఆ వీడియోలో మాట్లాడుతూ ..”రాజమౌళి తీసిన అన్ని సినిమాలలోకి ఆమెకు నచ్చని సినిమా ఏదైనా ఉంది అంటే అది యమదొంగ అని చెప్పుకొచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఆ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడం ..అప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలలో ఏదో ఒక మంచి విషయాన్ని జనాలకి చెప్పుకు రావడం.. ఆ సినిమా కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీయడం రమా రాజమౌళికి నచ్చలేదట .

ఈ సినిమా కథ విన్నప్పుడే అదే విషయాన్ని చెప్పిన రాజమౌళి ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమతో ఈ సినిమాను తీసినట్లు ఆమె చెప్పుకొచ్చింది . ప్రపంచ దేశాలు దర్శకధీరుడు అంటూ పొగిడేసిన రాజమౌళి పై.. తన భార్య ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఆయన పరువు పోయింది అంటున్నారు పలువురు నెటిజన్స్. త్వరలోనే రాజమౌళి మహేష్ బాబు తో సరికొత్త అడ్వెంచర్స్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news