Moviesత్రిష కొత్త ఇల్లు ఖరీదు అన్ని కోట్లా..స్పెషాలిటీస్ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

త్రిష కొత్త ఇల్లు ఖరీదు అన్ని కోట్లా..స్పెషాలిటీస్ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “నీ మనసు నాకు తెలుసు” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన త్రిష .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత ఎవరు ఊహించిన విధంగా రెబెల్ స్టార్ హీరో ప్రభాస్ వర్షం సినిమాలో ఆఫర్ అందుకొని తనదైన స్టైల్ లో నటించిన హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమా హిట్ తర్వాత త్రిష తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది . అంతేకాదు టాలీవుడ్, కోలీవుడ్ బడా స్టార్ హీరోలతో అందరితో నటించి ట్రాక్ రికార్డ్ ను సొంతం చేసుకుంది . కాగా వ్యక్తిగత కారణాలవల్ల కొన్ని సంవత్సరాలపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసిన త్రిష .. ఈ మధ్యనే పోనియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే మంచి మంచి ఆఫర్స్ ను పట్టేసిన త్రిష రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తూ .. డిమాండ్ చేసి మరి తీసుకుంటుంది .

రీసెంట్ గానే తన సొంత ఇంటి కలను తీర్చుకుంది త్రిష. ఏకంగా 35 కోట్లు ఖర్చుపెట్టి కొన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ త్రిష ఈ హౌస్ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇంటీరియర్ డిజైన్లను తన సొంత టెస్ట్ ప్రకారం డిజైన్ చేయించుకుందట . అంతేకాదు ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకంగా ఒక పెద్ద పూజ గదిని నిర్మించుకుని తన బ్యూటీషియన్ కోసం స్పెషల్ కూడా రూమ్ చేయించుకుందట. అంతేకాదు ఫిట్ నెస్ కోసం జిమ్ కూడా పెట్టించుకుందట. భవిష్యత్తులో ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంటే అతగాడి తో త్రిష కాపురం ఇక్కడే పెట్టబోతుంది అంటూ కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఓ హీరోయిన్ ఇలా 35 కోట్లు ఖర్చు చేసి ఇల్లు ను కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలోని హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news