తెలుగు చిత్ర పరిశ్రమలో నటులు కేవలం నటించడానికే పరిమితం కాలేదు. వారి కుటుంబాల మధ్య కూడా సంబంధాలు పెంచుకున్నారు. రాకపోకలు కూడా సాగించేవారు. వారి వారి కుటుంబాల్లో పిల్లలను ఇచ్చి పుచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కినేని.. రామానాయుడు వియ్యంకులు. అలానే.. అనేక మంది ఉన్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో సంతోషం అయినా.. దుఃఖమైనా.. కలిసి పంచుకునే వారు.
ఇలానే.. తెలుగు వారి సోగ్గాడు.. శోభన్‌బాబు.. హఠాన్మరణం చెందిన సమయంలో.. ఒకప్పటి వెండితెర వేల్పు.. అభినేత్రి వాణిశ్రీ భోరున ఏడ్చేశారు. ఆయన మరణించారని తెలియడంతో హుటా హుటిన చెన్నైలోనే ఉన్న ఆమె శోభన్‌బాబు ఇంటికి వెళ్లారు. డెడ్ బాడీ దగ్గరే కూర్చుని.. రోజు రోజంతా కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి ఆ సమయంలోకుటుంబ సభ్యుల కన్నా కూడా వాణిశ్రీనే ఎక్కువగా రోదించారని, బాధపడ్డారని మీడియా కూడా పేర్కొంది.
అయితే.. ఈ పరిణామంపై తర్వాత అనేక గుసగుసలు వినిపించాయి. వీరి మధ్య ఏదో అనుబంధం ఉందని.. లేకపోతే.. వాణిశ్రీ అంతగా ఎందుకు రోదిస్తారని కూడా కామెంట్లు వచ్చాయి. అయితే.. దీనిపై అప్పటి సినీ క్రిటిక్ ఒకరు తర్వాత కాలంలో వివరిస్తూ.. వాణిశ్రీకి.. శోభన్‌బాబుకు మధ్య ఎలాంటి సంబంధం లేదని.. కానీ, శోభన్‌బాబు ఆర్థిక సూత్రాలను వాణిశ్రీ ఫాలో అయ్యేవారని చెప్పారు.
అంతేకాదు.. ఆయన సూచనల మేరకు.. చెన్నై శివారులో ఇల్లు కొన్నారని.. తర్వాత కూడా ఓ 100 ఎకరాల పొలం కొనిపెట్టారని.. అందుకే వారి మధ్య ఒక స్నేహం బలపడిందని.. ఇంతకు మించి ఏమీ లేదని చెప్పుకొచ్చారు. కానీ, నాటి సీన్ చూసిన వారు మాత్రం.. ఏదో ఉందని మాత్రం అను కోవడం గమనార్హం.