Movies"వీర సింహా రెడ్డి" సినిమా హిట్.. తెగ బాధపడిపోతున్న తెలుగు డైరెక్టర్..ఎందుకంటే..?

“వీర సింహా రెడ్డి” సినిమా హిట్.. తెగ బాధపడిపోతున్న తెలుగు డైరెక్టర్..ఎందుకంటే..?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం వీరసింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నోటి నుండి వచ్చిన ఒక్కొక్క పవర్ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్ అభిమానులకు ఊపు తెప్పిస్తుంది .

అంతేకాదు సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నా సరే కాన్సన్ట్రేషన్ మొత్తం ఫాన్స్ బాలయ్య పైన చేశారు అంటే .. బాలయ్య పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లోను హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బీభత్సమైన కలెక్షన్స్ సాధిస్తున్న వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ముగిశాయి. ప్రతి ఒక్కరు వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య పర్ఫామెన్స్ చూసి.. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అంటూ ఒకరు ..నీలాంటి హీరోనే ఇండస్ట్రీకి కావాలి అంటూ మరొకరు ..ఇలా బాలయ్యను హై రేంజ్ లో పొగిడేస్తున్నారు .

అయితే తెలుగు డైరెక్టర్ మాత్రం వీరసింహారెడ్డి సినిమా హిట్ అయినా.. సరే తెగ బాధ పడిపోతున్నారట . ఆయన ఎవరో కాదు బాలయ్య జాన్ జిగిడి లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను ..ఎస్ ఇప్పటివరకు బాలయ్య ను మాస్ యాంగిల్ లో చూపించడం అంటే బోయపాటి అనే టాక్ ఉంది .

కానీ ఫస్ట్ టైం గోపీచంద్ మలినేని బోయపాటి సెంటిమెంట్ కి చెక్ పెడుతూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాలయ్య ఖాతాలో వేశాడు. ఈ క్రమంలోని ఇప్పుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబోపై అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. దీంతో బోయపాటి శ్రీను ..బాలయ్య వీరసింహారెడ్డి హిట్ విషయంలో కూసింత డిసప్పాయింట్ అవుతున్నాడట. ఏది ఏమైనా సరే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసేసాడు బాలయ్య..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news