థమన్ సంక్రాంతి సినిమా రిలీజ్‌ను టెన్షన్‌లో పేట్టేసినట్టే ఉన్నాడు. ముందుగా మూడు పెద్ద సినిమాల్లో విజయ్ వారసుడు జనవరి 11న, బాలయ్య వీరసింహారెడ్డి 12, చిరు వాల్తేరు వీరయ్య 13 అనుకున్నారు. చిరు సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. వారసుడు, వీరసింహా రెండిటకి థమనే మ్యూజిక్. రిలీజ్ డేట్లు దగ్గర పడుతున్నాయి. ఇంతలో ఫ్యాన్స్ కంగారు పడే న్యూస్‌లు బయటకు వస్తున్నాయి.
విజయ్ వారసుడు తెలుగులో ఒకటి రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇందుకు కారణం థమన్ ఆర్ ఆర్ ఆలస్యం కావడమే అంటున్నారు. తెలుగు వెర్షన్‌కు వచ్చే సరికే ఈ ఆలస్యం అయ్యిందని కూడా టాక్ నడుస్తోంది. పేరుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అంటున్నా.. ఆర్ ఆర్ లేట్ అవ్వడమే అసలు కారణం అంటున్నారు.
ఇక బాలయ్య వీరసింహా డేట్ 12 వేశారు. థమన్ అటు వారసుడు, ఇటు వీరసింహాకు కూడా ఆర్ ఆర్ ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో వీరసింహా రిలీజ్ కూడా ఇప్పుడు టెన్షన్‌లో పడిందంటున్నారు. అసలు వారసుడు, వీరయ్య రెండు సెన్సార్ పూర్తయ్యాయి. వీరసింహారెడ్డికి ఇంకా సెన్సార్ కూడా కంప్లీట్ కాలేదు. దీంతో బాలయ్య, నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైనట్టుగా కనిపిస్తోంది.
ఓ క్రియేటివ్ టెక్నీషియన్‌గా ఉన్న థమన్ ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్టులకు మ్యూజిక్ ఇవ్వాల్సి రావడంతో ఈ ఇబ్బంది ఎదురవుతోంది. థమన్ ఎప్పట్లోగా ఈ రెండు సినిమాలకు ఆర్ ఆర్ కంప్లీట్ చేస్తాడు ? అన్నదానిబట్టే ఈ రెండు సినిమాల రిలీజ్ ఆధారపడి ఉంది. వారసుడు అయితే సెన్సార్ అయిపోయింది. ఇప్పుడు వీరసింహారెడ్డికి ఇటు ఆర్ ఆర్‌తో పాటు సెన్సార్ కూడా ఫినిష్ కావాల్సి ఉంది.
ఎందుకంటే సెన్సార్ కంప్లీట్ అయితే కాని మల్టీ ఫ్లెక్స్ బుకింగ్ లు ఓపెన్ అవ్వవు. ఏదేమైనా సంక్రాంతి మూడు పెద్ద సినిమాల్లో వీరయ్యే కాస్త ఫ్రీ గా రిలీజ్ అవుతున్నట్టు ఉంది. పైగా వారసుడు, వీరసింహాతో పోలిస్తే ఒక రోజు లేట్‌గా వస్తోంది. విచిత్రం ఏంటంటే వీరసింహా ప్రమోషన్లు జోరుగా నడుస్తుంటే.. వీరయ్య ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు.