Moviesఈ 10 మంది హీరోయిన్ల పాలిట విల‌న్‌గా మారిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌......

ఈ 10 మంది హీరోయిన్ల పాలిట విల‌న్‌గా మారిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… ప‌వ‌న్ హ్యాండ్ ప‌డితే అంతే..!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ప‌వ‌న్ సినిమాల నుంచి పాలిటిక్స్ వ‌ర‌కు ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఇందుకు ప‌వ‌న్‌కు ఉన్న క్రేజే కార‌ణం. ప‌వ‌న్ ఎప్పుడూ డిప‌రెంట్ థింకింగ్‌తో ఉండ‌డ‌మే ఆయ‌న‌కు తిరుగులేని క్రేజ్ రావ‌డానికి కార‌ణం. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా క‌నీసం ఒక్క సినిమాలో అయినా న‌టించాల‌ని ఆశ‌ప‌డే హీరోయిన్లు ఎంతోమంది ? ఉన్నారు.

అయితే ప‌వ‌న్‌కు జోడీగా న‌టించిన హీరోయిన్ల‌లో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 10 మంది హీరోయిన్ల కెరీర్లు నాశ‌నం అయ్యాయి. ప‌వ‌న్ ప‌క్క‌న న‌టిస్తే త‌మ త‌ల‌రాత మారిపోతుంద‌ని వారు అనుకుంటే ఏకంగా ఆ సినిమాలు ప్లాప్ అయ్యి.. ఒక‌వేళ హిట్ అయినా కూడా ఆ హీరోయిన్లు అడ్ర‌స్ లేకుండా పోయారు. అలా అడ్ర‌స్ లేకుండా పోయిన హీరోయిన్లు ఎవ‌రో ?ఆ లిస్ట్ చూద్దాం.

1. దేవయాని:
1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వ‌చ్చిన సుస్వాగ‌తం సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా దేవ‌యాని హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత దేవ‌యాని ఒక‌టి రెండు సినిమాల‌కే అడ్ర‌స్ లేకుండా పోయింది.
2. ప్రీతి జింగానియా:
సూపర్ హిట్ సినిమా తమ్ముడులో పవన్‌తో కలిసి నటించిన ప్రీతి జింగానియా ఆ తర్వాత బాల‌య్య ఇండ‌స్ట్రీ హిట్ నరసింహనాయుడు, మోహ‌న్‌బాబు అధిపతి సినిమాలు చేసి మాయ‌మైంది.
3. సుప్రియ యార్లగడ్డ:
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లో అక్కినేని మ‌న‌వ‌రాలు యార్ల‌గ‌డ్డ సుప్రియ హీరోయిన్‌. ఆ సినిమా త‌ర్వాత 20 ఏళ్లు ఆమె అడ్ర‌స్ లేదు. త‌ర్వాత అడవి శేషు గూఢచారి మూవీలో కీలక పాత్ర పోషించింది.

4. కీర్తి రెడ్డి:
తొలిప్రేమ లాంటి క్లాసిక‌ల్ ల‌వ్ స్టోరీలో న‌టించిన కీర్తిరెడ్డి ఆ తర్వాత అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్కగా క‌నిపించింది. త‌ర్వాత సినిమాల‌కు దూర‌మై పెళ్లి చేసుకుంది.
5. అదితి గోవిత్రికర్:
తమ్ముడు సినిమాలో లవ్లీగా బాగా ఫేమస్ అయిన అదితి ఆ తర్వాత సినిమాల్లో క‌న‌ప‌డ‌లేదు. అయితే ఆ సినిమాలో న‌టించే టైంకే ఆమెకు పెళ్లి అయ్యి ఒక్క బాబు కూడా ఉన్నాడు.
6. రేణు దేశాయ్:
రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో పవన్ కు జోడీగా నటించిన రేణు త‌ర్వాత ప‌వ‌న్ భార్య అయ్యింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌తో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావులో ఆమె తెర‌మీద క‌నిపిస్తోంది.

7. నేహా ఒబెరాయ్:
బాలు సినిమాలో నటించిన నేహా ఒబెరాయ్ ఆ తర్వాత జగపతిబాబుతో ఒక్క సినిమాలో న‌టించి అడ్ర‌స్ లేకుండా పోయింది.
8. మీరా చోప్రా:
పవన్ కళ్యాణ్ బంగారం హీరోయిన్‌ మీరా చోప్రా.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలతో చాప చుట్టేసింది.
9. నికిషా పటేల్:
కొమరం పులితో హీరోయిన్ అయ్యి ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నికిషా ప‌టేల్ ఆ త‌ర్వాత సాయిరామ్ శంక‌ర్‌, కళ్యాణ్ రామ్ ఓమ్ సినిమాలు చేసి లండ‌న్ వెళ్లిపోయింది.

10. సారాజెన్ డియాస్:
పంజా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సారాజెన్. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ ఆమె కనపడలేదు. అదే సినిమాలో న‌టించిన అంజ‌లీ లావాణియా కూడా ఆ త‌ర్వాత క‌న‌ప‌డ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news