నందమూరి నటసింహం వీర నర సింహా రెడ్డి ట్రయిలర్ వచ్చేసింది. బాలయ్య సినిమా ట్రైలర్ ఎలా ఉండాలో ఇది కూడా అలాగే ఉంది. అదిరిపోయే డైలాగులు, పంచ్‌లు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ పేలిన డైలాగులు, సెటైర్లు, అదిరిపోయే యాక్షన్, ఆయుధాలతో విలన్ల ఊచకోత, రొమాంటిక్ సాంగ్, ఎమోషన్ సీన్లు ఇలా బాలయ్య ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. సగటు సినీ అభిమానిని అలరించేలా వీరసింహారెడ్డి ట్రైలర్ ఉంది.
ట్రైలర్ చూసిన వాళ్లంతా ఇప్పటి వరకు సినిమాపై పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉందనే అంటున్నారు. ఫ్యాన్స్ అయితే సినిమాకు ముందే హిట్ కళ వచ్చేసినట్టు సంబరాలు షురూ చేసుకుంటున్నారు. ఇక ట్రైలర్ అంతా ఫుల్ మీల్స్‌లాగా ఉంది. సీమలో ఎవ్వరూ కత్తి పట్టకూడదని తానే కత్తి పట్టా అన్న పాయింట్ ఆలోచింపజేసేలా ఉంది.
ఇక జై బాలయ్య స్లోగన్ గురించి చెపుతూ పది నిమిషాలు ఏ పబ్‌కైనా వెళ్లి నిలబడితే అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుందంటూ జై బాలయ్య స్లోగన్ గురించి బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ప్రస్తుత ఏపీ రాజకీయాలపై సెటైరికల్‌గా వేసిన డైలాగులు ఇప్పుడు హైలెట్ అయ్యాయంటున్నారు. వీటిమీదే ఎక్కువ డిస్కర్షన్ నడుస్తోంది. ఆ డైలాగ్ ఏంటంటే సంతకంతో బోర్డు పై పేరు మారుతుంది కానీ ఆ పేరు గల వ్యక్తి గల చరిత్ర ఎప్పటికీ మారదు అని చెపుతాడు.
ఈ డైలాగ్ ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును ఉద్దేశించి వేసిందే అంటున్నారు. అలాగే బాలయ్య చివరి సినిమా అఖండలోనూ ఈ తరహా సెటైర్లు బాగా పేలాయి. ఇప్పుడు కూడా ఆ సెటైరికల్ డైలాగులు పండేలా చూసుకున్నారు. మరి సినిమాలో బాలయ్య సంచలనాలు ఇంకెన్ని ఉండబోతాయో చూడాలి. ట్రైలర్ అయితే పెద్దగా కథ ఏంటన్నది తెలియకుండా దాచేశారు. ఇద్దరు బాలయ్యలో ఉన్నారు. సీనియర్ బాలయ్య సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపించారు.
ఆమె ఏదో పగతో రగిలిపోతున్నట్టుగా ఉన్నట్టు ఆమె చెప్పిన ముత్తయిదువు, ముండమోపీ డైలాగ్ ఉంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే అదిరిపోయింది. మరి రేపు థియేటర్లలో బాలయ్య ఏం చేస్తారో ? చూడాలి.