నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న రోజు మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . కాగా నిన్న ఒంగోలులో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది.
ఎవరు ఊహించని విధంగా ఈవెంట్ కి నందమూరి ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్య రావడంతో ప్రాంగణం మొత్తం అరుపులు కేకులతో దద్దరిల్లిపోయింది . షో స్టార్టింగ్ మొదలు ఎండింగ్ వరకు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది . మరి ముఖ్యంగా హోస్టు సుమ కూడా ఎప్పుడూ లేనివిధంగా జై బాలయ్య పేరుని కలవరిస్తూనే ఉండింది . కాగాజనరల్ గా స్టార్ హీరోస్ స్టేజ్ పై ఎక్కువ మాట్లాడరు . ఈ విషయం మనందరికీ తెలిసిందే . వాళ్లకు ఉన్న స్టేటస్ కారణంగా కావచ్చు.. లేకపోతే మరే కారణంగా అయినా కావచ్చు.. స్టేజ్ ఎక్కిన తర్వాత నమస్తే అంటూ స్టార్ట్ చేసి ఏవో నాలుగు ముక్కలు మాట్లాడేసి థాంక్యూ అంటూ కట్ చేస్తారు .
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఇదే ఫాలో అవుతూ ఉంటారు . కానీ వాళ్లందరిలోకి ప్రత్యేకం మన బాలయ్య. వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏ రేంజ్ లో రెచ్చిపోయి బాలయ్య మాట్లాడాడొ మనకు తెలిసిందే. బాలయ్య మైక్ పెట్టుకున్న మొదలు.. మైక్ ఆపే వరకు ఒక్కొక్క మాట మనసులో నుంచి మాట్లాడి నందమూరి అభినందనలుకు మరింత చేరువయ్యాడు . అంతేకాదు ఇద్దరూ క్రాక్ లాంటి వ్యక్తులు కలిస్తేనే వీరసింహారెడ్డి అంటూ మాస్ లాంగ్వేజ్ ని వాడి తనదైన స్టైల్ లో అభిమానులకు కొత్త బూస్టప్ ఇచ్చాడు. ఏది ఏమైనా సరే స్టేజి పై మైక్ పట్టుకొని ఇంత ధైర్యంగా మాట్లాడాలంటే మన బాలయ్య తర్వాతే ఎవరైనా.. మీరేమంటారు అలాంటి సత్తా ఉన్న హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటారా..?