Movies"ఇన్నాళ్ళు లేవని నోరు ఇప్పుడు లేసింది ఏం".. రోజా పై గెటప్...

“ఇన్నాళ్ళు లేవని నోరు ఇప్పుడు లేసింది ఏం”.. రోజా పై గెటప్ శ్రీను సంచలన కామెంట్స్..!!

జబర్దస్త్ కమెడియన్ శీను ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే ..గెటప్ శీను అనగానే అందరూ టక్కన గుర్తుపట్టేస్తారు. అంతలా జబర్దస్త్ అనే కామెడీ షో లో రకరకాల గెటప్ లు వేసి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ శీను. కాగా జబర్దస్త్లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శీను .. ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే . ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు జబర్దస్త్ కంటిన్యూ చేస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు.

కాగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించి ..తన లేటెస్ట్ అప్డేట్స్ గురించి షేర్ చేసుకుని గెటప్ శీను.. రీసెంట్గా ఒకప్పటి జబర్దస్త్ జడ్జ్ రోజా పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగాఎవరు ఊహించిన విధంగా గెటప్ శ్రీను రోజా రోజాపై సైలెంట్ గా గౌరవిస్తూ మాట్లాడుతూనే ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చేసాడు. మనకు తెలిసిందే శ్రీను మెగా అభిమాని. ఆ విషయాని చాలా సార్లు ప్రూవ్ చేసాడు. రీసెంట్ గా రోజా మెగా హీరోల పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.

ఆయన సోషల్ మీడియా లో రాసుకోస్తూ ..‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో ,?రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం .. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి .. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి ‘ అంటూ తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చాడు శ్రీను. ప్రజంట్ ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

అంతేకాదు రోజా ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ పై ఎలా విరుచుకుపడుతుందో తెలిసిందే . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి , నాగబాబులను కూడా ఓ రేంజ్ లో ఫైర్ తో మాట్లాడుతుంది . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ అభిమాని అయిన గెటప్ శీను ఇంతలా కోప్పడడం మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. అయితే కొందరు శ్రీను మాటల పై ఫైర్ అవుతున్నారు. “ఇన్నాళ్ళు అన్ని మూసుకుని ఉన్న నువ్వు..ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నావే ఏం” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news