Moviesసినీన‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఇక‌లేరు... ఆయ‌న కెరీర్ హైలెట్స్ ఇవే..!

సినీన‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఇక‌లేరు… ఆయ‌న కెరీర్ హైలెట్స్ ఇవే..!

సినీన‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఇక‌లేరు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న అనారోగ్యంతో మృతిచెందారు. ఆయ‌న ఎన్టీఆర్‌; ఏఎన్నార్ త‌రంలోని గొప్ప‌న‌టుల్లో ఒక‌రు. ఆయ‌న కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లం కౌత‌వ‌రం గ్రామంలో జ‌న్మించారు. ఆయ‌న‌కు నాగేశ్వ‌ర‌మ్మ‌తో 1960 ఏప్రిల్ 10న వివాహం జ‌రిగింది. 1959లో సిపాయి కూతురు ఆయ‌న‌కు ఫ‌స్ట్ మూవీ. ఆయ‌న‌కు ఇద్ద‌రు కూతుళ్లు, ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు.

గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న ఫిల్మ్‌న‌గ‌ర్లోని ఆయ‌న నివాసంలో మృతిచెందారు.
న‌వ‌ర‌స న‌ట‌సౌర్వ‌భౌముడిగా ఆయ‌న‌కు పేరుంది. పౌరాణిక‌, సాంఘీక‌, జాన‌ప‌ద చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న కెరీర్‌లో మ‌రో విశేషం ఏంటంటే ఎన్టీఆర్‌కు డూప్‌గా కూడా న‌టించారు. ఆయ‌న కెరీర్ మొత్తం మీద 777 సినిమాల్లో న‌టించారు.

ఆయ‌న ఆఖ‌రు సినిమా జాతీయ అవార్డు అందుకున్న మ‌హ‌ర్షి. న‌టుడిగా ఆ సినిమాయే ఆయ‌న‌కు చివ‌రి సినిమా. ఇక ఆయ‌న కెరీర్‌లో 28 పౌరాణిక‌, 51 జాన‌ప‌ద‌, 9 చారిత్రిక సినిమాల్లో ఆయ‌న న‌టించారు. ఆయ‌న 200 కు పైగా ద‌ర్శ‌కుల సినిమాల‌లో న‌టించారు. ఆయ‌న కెరీర్‌లో 365 సినిమాలు 10కు పైగా ఉన్నాయి. ఆయ‌న న‌టించిన 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. రావ‌ణుడు, ధుర్యోధ‌నుడు, య‌ముడు లాంటి పాత్ర‌లకు ఆయ‌న పెట్టింది పేరు.

ఇంట‌ర్ చ‌దువుతున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు సినిమాల‌పై ఆస‌క్తి ఉండ‌డంతో మ‌ద్రాస్ వెళ్లారు. ఆయ‌న‌లోని టాలెంట్‌ను డీఎల్ నారాయ‌ణ గుర్తించి సినిమాల‌లో అవ‌కాశం ఇచ్చారు. ఇక రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న 1996లో మ‌చిలీప‌ట్నం నుంచి టీడీపీ త‌ర‌పున లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news