ప్రతి ఒక్కరికి ఓ హీరోయిన్ , ఓ హీరో ఫేవరెట్ గా ఉంటారు . మనకు కూడా ఒక హీరో ఫేవరెట్ గా ఉండే ఉంటారు . అయితే మనకు నచ్చిన ఫేవరెట్ హీరో మనకి ఇష్టమైన వాళ్ళకి కూడా నచ్చాలి అన్న రూవ్ లేదు. ఎవరు ఊహించని విధంగా అల్లు ఫ్యామిలీ మొత్తం ఒకే హీరోయిన్ అంటే పడి చచ్చిపోతుండటం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో .
అల్లు రామలింగయ్య గారి పేరు చెప్తే ఎంతటి గౌరవం ఇస్తారో అంతకు డబల్ గౌరవం ఇప్పుడు అల్లు అరవింద్ పేరు చెప్తే ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలో సినిమాల్లో నటించి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా రీసెంట్ గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ , అల్లు అరవింద్ ఒకే బ్యూటీ పేరుని జపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
దానికి మెయిన్ రీజన్ ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరూ ఆ హీరోయిన్ తో ఎక్కువగా మింగిల్ అవుతూ ఉండడమే. ఆమె మరి ఎవరో కాదు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. రీసెంట్గా 18 పేజీస్ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఏ రేంజ్ లో అనుపమను పొగిడేసారో తెలిసిందే అంతకుముందు సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ సైతం ఏకంగా “నాకు నీలాంటి కూతురు ఉంటే బాగుండు” అంటూ అనుపమను పొగిడేసారు . ఈ క్రమంలోని అంతకుముందే శిరీష్ సైతం అనుపమ పరమేశ్వరణ్ ని తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని ట్రై చేశాడట. ఇలా ముగ్గురు.. తండ్రి కొడుకులు అనుపమ పరమేశ్వరన్ పేరు జపిస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. కావాలని కొందరు అల్లు ఫ్యామిలీ మొత్తం అనుపమ భజన చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి దీనిపై అల్లు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో..?