Moviesబాల‌య్య హీరోగా చేసిన ' మ‌రోజీవితం ' సినిమా ఉంద‌ని మీకు...

బాల‌య్య హీరోగా చేసిన ‘ మ‌రోజీవితం ‘ సినిమా ఉంద‌ని మీకు తెలుసా… ఆ సినిమా ఏమైంది…!

యువరత్న నందమూరి నటసింహం తన కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించారు. తాతమ్మకల సినిమాతో కెరిర్‌ ప్రారంభించిన బాలయ్య చివరి సినిమా అఖండ. తన తండ్రి ఎన్టీఆర్ నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తండ్రిలాగా పౌరాణికం, సాంఘికం, జానపదం, చారిత్రకం, ఇలా ఏ కథలో అయినా సింపుల్‌గా ఇమిడి పోగలడు. డైలాగులు చెప్పటంలోనూ తన తండ్రి ఎన్టీఆర్‌ను అచ్చు గుద్దినట్టు దింపేయటం బాలయ్య శైలి.

వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వీర సింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్‌లో 107వ సినిమాగా తెరకెక్కింది. ఇక బాలయ్య 108వ ప్రాజెక్ట్ కూడా షూటింగ్ ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కితున్న‌ ఈ సినిమాలో బాలయ్య 55 సంవత్సరాల వయసు ఉన్న మధ్య వయస్కుడి పాత్రలో కనిపించబోతున్నాడు. బాలయ్య ఈ తరహా పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. బాలయ్య అభిమానులకు ఆయన నటించిన అన్ని సినిమాల రికార్డులు కలెక్షన్లు, శత దినోత్సవ నుంచి 1000 రోజులు ఆడిన సినిమాల వరకు అన్ని మైండ్లో ఉండిపోతాయి.

బాలయ్య నటించిన 107 సినిమాల పేర్లు చెప్పమంటే ఐదే ఐదు నిమిషాల్లో చెప్పే వీరాభిమానులు కూడా ఉన్నారు. అయితే బాలయ్య కెరీర్‌లో ‘మరో జీవితం’ అనే ఒక సినిమా తెరకెక్కింది. ఈ టైటిల్ తో వచ్చిన సినిమాలో బాలయ్య నటించిన విషయమే చాలామంది అభిమానులకు తెలియదు. అయితే ఇది వాస్తవం
బాలయ్య హీరోగా శ్రీ వల్లి ప్రొడక్షన్స్ సంస్థ ‘మరో జీవితం’ పేరుతో ఒక సినిమా నిర్మించింది. భానుప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించారు. చక్రవర్తి స్వరాలు అందించారు.

ఈ సినిమాకు నిర్మాతలు 1984 ఆగస్టు 15న షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా 1985 జనవరి 24న రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడు ‘మరో జీవితం’ అన్న పేరు పెట్టారు. షూటింగ్ చివరి వరకు అదే పేరుతో షూటింగ్ జరిగింది. అయితే రిలీజ్ కి ముందు ‘మరో జీవితం’ పేరు మార్చేసి ‘ఆత్మబలం’ అని పెట్టారు. ‘ఆత్మబలం’ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగుతుంది. బాలీవుడ్ లో హిట్ అయిన ‘కర్జ్’ సినిమాకు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు.
ఈ సినిమాలో శరత్ బాబు, త‌మిళ న‌టుడు నంబియార్ మధ్య ఆస్తి వైరం నెలకొని ఉంటుంది. ఈ కేసులో శరత్ బాబు విజయం సాధిస్తాడు.

అయితే దుర్మార్గుడు అయిన నంబియార్ ఆనంద్‌ ప్రేయసి సిల్క్ స్మితను అడ్డం పెట్టుకుని ఆమెతో అతడిని చంపిస్తాడు. ఆనంద్ చనిపోయిన 22 సంవత్సరాల తర్వాత బాలకృష్ణ పూర్వజన్మ స్మృతి పొందితాడు. బాలయ్య రూపం వేరైనా అతడి ఆత్మ ఆనంద్‌ది కావటం సినిమాలో ఆసక్తి కలిగించే విషయం. గత జన్మలో తనను హత్య చేసిన మాయను ప్రసాద్ చిత్రహింసలకు గురిచేసి చంపేస్తాడు. ఇక బాలయ్యకు జోడిగా భానుప్రియ హీరోయిన్ గా నటించింది. వారిద్దరి పెళ్లితో సినిమా ముగుస్తుంది. చివరిలో టైటిల్ మార్చి ‘ఆత్మ బలం’ రిలీజ్ అయినా కూడా ఎందుకో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news