క్రేజ్ ఉన్న బ్యూటీలకి అవకాశాలు రాకపోతే దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారో ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. ఒకటి రెండు సినిమాలతో సర్దేసుకునే బాలీవుడ్ భామలేమో గానీ మన తెలుగమ్మాయిలైతే, నడి సముద్రంలో నిలబడిన నావలాగా మారిపోతున్నారు. నార్త్ హీరోయిన్స్ అయితే, సినిమాలు ఏదో రకంగా ఏదో క్యారెక్టర్ చేసుకుంటూ బాగానే వెనకేసుకుంటారు.
ఇక సౌత్ అంటే తమిళం, మలాయళం, కన్నడ భాషలలో హీరోయిన్స్ తెలుగుతో పాటు ఏ భాషలో అయినా అవకాశం వస్తే బండి బాగానే లాగిస్తున్నారు. భాష రాకపోయినా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నారు. ఒక భాషలో హిట్ అందుకుంటే ఆ ఒక్క హిట్ ఇంకో భాషలో అవకాశం అందుకుంటున్నారు. అలా ఇండస్ట్రీకొచ్చిన హీరోయిన్స్ కొందరు ఓ పాతిక సినిమాల వరకూ చేసి బాగానే కూడబెట్టుకుంటున్నారు.
కానీ, ఎటు తిరిగీ మన తెలుగమ్మాయిలే అన్ని రకాలుగా సతమతమవుతున్నారు. కొన్ని సినిమాలు చేసి వాటిలో కొన్ని సక్సెస్‌లు అందుకున్నా .. అనూహ్యంగా రెండు ఫ్లాపులొస్తే మాత్రం మేకర్స్ పట్టించుకోవడం లేదు. మళ్ళీ సినిమా అవకాశం అంటే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అవసరానికి అన్నట్టుగా చాలామంది చుట్టూ తిరుగాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా అంజలి లాంటి నటీమణులే వెలగలేకపోయారు.
దీనికికంటే కూడా అంగాంగ ప్రదర్శన చేస్తూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ తీసి తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు. అవే వారికి కాస్తో కూస్తో హెల్ప్ అవుతున్నాయి గానీ పూర్తి స్థాయిలో మాత్రం హీరోయిన్ అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఈషారెబ్బ లాంటి తెలుగమ్మాయులు ఎంత కావాలో అంత ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. కానీ, ఆ అవకాశాలిచ్చేవారు మాత్రం కనిపించడం లేదు.