ఇప్పుడు సినిమా అంటే అన్నీ లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమా అంటే అంచనాలకి మించిన బడ్జెట్‌ని నిర్మాత ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టిన పెట్టుబడి మళ్ళీ కనీసం రెండింతలు తెచ్చిపెడుతున్న ఒకే ఒక్క దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. సినిమా కోసం ఎంతగా శ్రమిస్తారో ఆయన సక్సెస్‌లను చూస్తేనే తెలుస్తుంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమైన ఆయన ప్రస్తానం ఈ యేడాది వచ్చిన త్రిబుల్ ఆర్ వరకు పరాజయం అన్నది లేకుండా దూసుకుపోతోంది.
ప్రస్తుతం మన సౌత్‌లో ఉన్న దర్శకులలో వెలకట్టలేని వారెవరైనా ఉన్నారంటే అది దర్శక ధీరుడే. మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచంలో ఏ ఒక్కరూ ఊహించని విధంగా మార్చేశారు. ఆ తర్వాత ఆ స్కేల్‌లో సినిమా తీసే సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ అని చెప్పాలి. వీరు సినిమా కోసం పడే కష్టం ఊహించలేము. అయితే, హీరోలే కాకుండా హీరోయిన్స్, సీనియర్ నటీమణులు సినిమా కోసం చాలా బౌండరీస్ దాటేస్తున్నారు.
ముఖ్యంగా హీరోలతో రొమాన్స్ అంటే హీరోయిన్లు ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. హీరోతో కలిసి లిప్ కిస్ సన్నివేశంలో గానీ, బెడ్రూం సన్నివేశాలలో నటించాలంటే రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నారు. దీనికి కేవలం ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రమే కాదు..సీనియర్ నటీమణులు వెనకడు వేసి నో అని చెప్పడం లేదు. ముఖ్యంగా టబు, శ్రియ లాంటి సీనియర్ హీరోయిన్స్ వయసులో తమకంటూ చిన్న హీరోలతోనూ పెదవులు కలిపి తెర మీద రెచ్చిపోతున్నారు.
కథలో తమ పాత్ర ఇదీ అని తెలిసినా..ఏజ్‌లో మీకంటే చిన్నవాడు హీరో.. అతనికి మీరు ముద్దు పెట్టాలి..అని దర్శకుడు చెబితే, సింపుల్‌గా ఓ నవ్వు నవ్వేసి సరే చేసేద్దాం అంటూ సైన్ చేస్తున్నారు. కథ డిమాండ్ చేసినప్పుడు ఏజ్ గురించి ఎందుకు ఆలోచించడం అనేది వారి అభిప్రాయం. సినిమా పరంగా చూస్తే అది నిజమే కదా.