Gossips"స్పైడర్" క్లోసింగ్ బిజినెస్...నష్టాల లెక్క ఎంతో తెలుసా

“స్పైడర్” క్లోసింగ్ బిజినెస్…నష్టాల లెక్క ఎంతో తెలుసా

బ్రహ్మోత్సవం డిసాస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ్ సెన్సషనల్ డైరెక్టర్ AR మురుగుదాస్ తో చేసిన చిత్రం స్పైడర్. ఈ సినిమా దసరా సందర్బంగా సెప్టెంబర్ 26న రిలీజ్ అయ్యి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుండి వచ్చిన డిసాస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బారి నష్టాలను మిగిల్చింది. సినిమా బిజినెస్ ఇప్పుడు క్లోజ్ అయ్యిపోయింది, ఫైన‌ల్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 62.21 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ లెక్క‌న ఈ సినిమాకు సగానికి పైగా న‌ష్టాలు వ‌చ్చాయి. దాదాపు అన్ని ఏరియాల్లోను బ‌య్య‌ర్లు 50-60 శాతం ఇంకా చెప్పాలంటే కొన్ని ఏరియాల్లో 65 శాతం కూడా న‌ష్ట‌పోయారు. సీడెడ్‌లో అయితే స్పైడ‌ర్ దెబ్బ బ‌య్య‌ర్ల‌కు మామూలుగా ప‌డ‌లేదు. స్పైడ‌ర్ ఎంత చెత్త రికార్డు త‌న పేరుమీద వేసుకుందంటే ఇండియాలోనే అత్యంత చెత్త డిజాస్ట‌ర్ల జాబితాలో స్పైడ‌ర్‌కు మూడో ప్లేస్ ద‌క్కింది.

స్పైడ‌ర్ క్లోజింగ్ షేర్ : (రూ. కోట్లలో)

నైజాం – 9.80
సీడెడ్ – 4.70
నెల్లూరు – 1.85
కృష్ణా – 2.55
గుంటూరు – 3.60
ఉత్తరాంధ్ర – 3.90
ఈస్ట్ – 3.76
వెస్ట్ – 2.80

———————————–

ఏపీ + తెలంగాణ 32 . 96 కోట్లు

———————————–

ఓవర్సీస్ – 6. 75
రెస్టాఫ్ ఇండియా – 8 . 60
తమిళ్ + మలయాళం – 13 .90

————————————————-

వరల్డ్ వైడ్ ఫైన‌ల్ షేర్ = 62.21 కోట్లు

————————————————-

ఫస్ట్ టైం ద్విభాషా చిత్రం చేసిన మహేష్ కి ఘోర అనుభవం ఎదురైంది. శ్రీమంతుడు తో కెరీర్ పీక్స్ లో వున్నామహేష్ , బ్రహ్మోత్సవం, స్పైడర్ డిసాస్టర్ లతో ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి . ఈ సంక్షోభం నుండి మహేష్ ని కొరటాల శివే బయట పడెయ్యాలి మరి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news