Gossipsబిగ్ బాస్ షో పై ఫైరైనా హన్సిక

బిగ్ బాస్ షో పై ఫైరైనా హన్సిక

సౌత్ హీరోయిన్ల‌పై ఓ బుల్లి తెర న‌టి నోరుపారేసుకుంది
ఇక్క‌డి నాయ‌కిలంతా అందాల ఆర‌బోత‌కు ఎక్కువ ప్రాధానం ఇస్తార‌ని వ్యాఖ్యానించింది.
ఇటీవల హిందీలో మొద‌లైన బిగ్ బాస్ కొత్త సీజ‌న్ లో కంటెస్టెంట్ గా ఉన్న బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ సౌత్ హీరోయిన్స్ పై కొన్ని వివాదా స్పద వ్యాఖ్యలు చేసింది.సౌత్ హీరోయిన్స్ ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎక్స్ పోజింగ్ ఎక్కువ చేస్తారని.. చెప్పింది. అంతే కాకుండా అమ్మడికి తెలుగులో మహేష్ – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఆఫర్ కూడా వచ్చిందని చెప్పింది. కానీ తాను అందుకు ఒప్పుకోలేదట.సౌత్ హీరోయిన్స్ అతిగా అందాలని ఆరబోస్తారని చేసిన వ్యాఖ్యలకు నెటిజన్స్ చాలా వరకు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో సౌత్ బ్యూటీ హన్సిక కూడా తనదైన శైలిలో కౌంటర్ చేసింది. బాలీవుడ్ లో నటించిన చాలా మంది స్టార్ హీరోయిన్స్ సౌత్ లో పనిచే శారన్న విషయం హీనా ఖాన్ కు తెలియదా? ఈ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆమె సిగ్గుపడాలని చెబుతూ.. జాగ్రత్తగా మాట్లాడాలని కొంచెం గట్టిగానే కౌంటర్ వేసింది. ఇక తాను సౌత్ హీరోయిన్ గా కొనసాగుతున్నందుకు చాలా గర్వపడుతున్నానని తన ట్విట్టర్ ద్వారా ఈ దేశముదురు భామ కామెంట్ చేసింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news