ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత హిట్ కొట్టి ఆ స్టేటస్ ని అలాగే కంటిన్యూ చేయడం నిజమైన హీరోయిన్ లక్షణాలు.. అలాంటి క్రేజ్ ను చాలా తక్కువ మంది సంపాదించుకుంటారు . కాగా అదే క్రేజ్ ను సంపాదించుకుంది కృతిశెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబమ్మా అలాంటి క్రేజ్ ను సంపాదించుకుంది.
అయితే రెండు సినిమాలు చేయగానే అమ్మడు అందాలు నాలుగో సినిమాకి బోర్ కొట్టేసింది . ఈ క్రమంలోనే బేబమ్మ అందాలను జనాలు పట్టించుకోవడం లేదు . ఉప్పెన సినిమాలో బేబమ్మగా ఫేమస్ అయిన కృత్తి శెట్టి మొదటి సినిమాలో నటించిన తీరు జనాలను ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ సినిమాలోనే హాట్ రొమాన్స్ చేస్తూ వైష్ణవ్ తేజ్ కు చెమటలు పట్టించడమే కాదు థియేటర్‌కు వచ్చిన ఆడియన్స్ కు చెమటలు పట్టించింది .
ఈ క్రమంలోనే ఆమెను నెత్తిన పెట్టుకున్నారు జనాలు. ఆమె ఆ తర్వాత నటించిన రెండు సినిమాలను సైతం బ్లాక్ బస్టర్ హిట్టుగా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచోపెట్టారు . సీన్ కట్ చేస్తే మిగతా వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే కృతి కెరియర్ క్లోజ్ అయిపోతుంది అనుకున్న టైం లో బంపర్ ఆఫర్ కొట్టేసింది . ఉప్పెన సినిమా టైంలో ప్రమోషన్స్ లో భాగంగా తాను రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ అని ఎలాగైనా తనతో ఒక్క సినిమా నటిస్తే చాలు అని చెప్పుకొచ్చింది .
ఫైనల్లీ అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న చరణ్ త్వరలోనే సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కృటి శెట్టి ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మొదటి సినిమాతో లక్ ని తెచ్చిపెట్టిన ఆ బ్యూటీనే రెండో సినిమాను బ్లాక్ బస్టర్ హీట్ అయ్యేలా అదృష్టం తీసుకొస్తుందని బుచ్చిబాబు గట్టిగా నమ్ముతున్నాడట. ఈ క్రమంలోనే బేబమ్మ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.