కొందరు నటీమణులు మల్టీ టాలెంటెడ్ అయినా కెరీర్ ఉన్నపలంగా చతికిల పడుతుంది. దీనికి అనేక కారణాలుంటాయి. అద్భుతమైన ఫిజిక్..హీరోయిన్ అని మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా మంచి టాలెంటెడ్ అనిపించుకున్న వారు కూడా అనూహ్యంగా ఇండస్ట్రీలో కనుమరుగవుతున్నారు. అలాంటి వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. ఈమె సౌత్‌లో నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమాలు చేసి హీరోయిన్‌గా సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. చెప్పాలంటే ఆమె నటించిన సినిమాలన్నిటిలో మలయాళం సినిమాలే ఎక్కువ. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలున్నాయి. మమతా మోహన్ దాస్ మలయాళంలో స్టార్ హీరోయిన్. అక్కడ ఒకదశలో తను హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్.
ఆ క్రేజ్‌తోనే తెలుగులో ఛాన్స్ అందుకుంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ యమదొంగ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో ప్రియమణి మరో హీరోయిన్. అయినా మమతకి మంచి పేరొచ్చింది. ముఖ్యంగా డాన్స్, సింగర్‌గా పాపులర్ అయింది. ఈ సినిమాలో లేడీ విలన్‌గా ఆమె పోషించిన పాత్ర అసామాన్యం. ఆ తర్వాత జగపతిబాబు, నాగార్జున సరసన నటించింది మమత మోహన్ దాస్.
సాధారణంగా ఇంత టాలెంటెడ్ హీరోయిన్‌ని కింగ్ నాగార్జున అంత త్వరగా వదిలిపెట్టరు. హీరోయిన్‌గా, సింగర్‌గా పాపులర్ కాబట్టి తన సొంత బ్యానర్‌లోనే అవకాశాలిస్తారు. అయితే, అనూహ్యంగా మమత క్యాన్సర్ భారిన పడి సతమతమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాధితో చాలా ఇబ్బంది పడింది. ఎట్టకేలకి మళ్ళీ జబ్బు నుంచి కోలుకొని మళ్ళీ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే, అవకాశాలిచ్చేవారే కనిపించడం లేదు.