సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయానికి ట్రోలింగ్ చేస్తూ స్టార్ సెలబ్రిటీలను సైతం ఇబ్బంది పెడుతున్నారు ట్రోలర్స్. తాజాగా స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చేష్టలను ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే రీసెంట్గా బాలీవుడ్ నటుడు జాకిష్రాఫ్ ఇంట్లో 80టీస్ పార్టీ వేడుక జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ పాల్గొని సందడి చేశారు . మరీ ముఖ్యంగా ఈ పార్టీలో తమ వయసును మర్చిపోయి మరి హంగామా చేస్తూ డాన్స్ స్టెప్పులు వేయడం సంచలనంగా మారింది .
ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు కొత్త ఉత్సాహం ఇచ్చారు సెలబ్రిటీస్. ఈ ఫొటోస్ వీడియోస్ చూసి కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొందరు ముసలోళ్ళకి దసరా పండుగ అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా రాధా ఓ వీడియోని షేర్ చేసింది . ఈ వీడియో లో ఆమె డాన్స్ ఇరగదీసింది. ఇప్పటికి ఆమె ఓ రేంజ్ లో హంగామా చేస్తుంది .
ఈ వీడియో చూస్తే అది ఈజీ గా అర్ధమైపోతుంది. కాగా ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ నటినటులు అంత బాగా ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా డాన్స్ చేసింది. ఇప్పుడు కూడా అంతే బాగా డాన్స్ చేసింది అంటూ చెప్పుకొచ్చారు నటులు. ఈ క్రమంలోనే వెంకటేష్ వచ్చి.. మెడలో పూలదండ వేయడం .. ఒక హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే అక్కడే ఉన్న చిరంజీవి వచ్చి ఏకంగా ముద్దు పెట్టి హగ్ ఇవ్వడం సంచలనంగా మారింది . ఈ వీడియోలో చిరంజీవి చేసిన పనిని కొందరు తప్పు పడుతున్నారు. ఎంత వయసు అయిపోయిన సరే మీకు అంటూ కొన్ని హద్దులు ఉంటాయి కదా అంటూ మండిపడుతున్నారు . మరికొందరు వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ కి ప్రైవసీ లేకుండా పోయింది అన్నది మాత్రం వాస్తవం..!!