Moviesచిన్న తప్పు..గుర్తుపట్టనేంతగా మారిపోయిన రకుల్ ప్రీత్ సింగ్..!!

చిన్న తప్పు..గుర్తుపట్టనేంతగా మారిపోయిన రకుల్ ప్రీత్ సింగ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలన్నా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నా.. గ్లామర్ గా ఎక్కువగా కనిపిస్తూ ఉండాలి . లేకపోతే హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం నెట్టుకురాలేరు . కాగా అలాంటి ఫిజిక్ కోసం.. గ్లామర్ కోసం హీరోయిన్స్ నానా రకాల డైట్ లు ఫాలో అవుతూ ఉంటారు . అందం కోసం కడుపు మాడ్చుకుని మరి వ్యాయామాలు చేస్తూ ఉంటారు . అయితే ఆవి లిమిట్స్ లో ఉంటే అన్నిటికీ మంచిదే ..హద్దులు దాటితే లేనిపోని రోగాలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం .

కాగా రీసెంట్గా అలా శక్తికి మించిన వ్యాయామాలు చేసిన సమంత మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే . కాగా ఇప్పుడు అలాంటి లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ .ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకొని బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకొని ..ఏకంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది . తెలుగులో మంచి మంచి అవకాశాలు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. తమిళ్, హిందీలో కూడా సినిమా అవకాశాలను దక్కించుకుంది .

ప్రజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది . అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో లు షేర్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసే రకుల్ ప్రీత్ సింగ్ .. రీసెంట్ ఫొటోస్ ఆమెను అస్సలు అభిమానులు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. ఇంతటి భారీ మార్పుకు కారణం రకుల్ చేసిన చిన్న తప్పే అంటూ తెలుస్తుంది. ఆమె గత ఆరు నెలలుగా పూర్తి డైట్ ఫాలో అవుతుందట. నో ఆయిల్- నో షుగర్- నో కార్బోహైడ్రేట్స్ -అంటూ ఓన్లీ లిక్విడ్ ఫుడ్స్ తో తన బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టడానికి ట్రై చేస్తుందట . ఈ క్రమంలోని రకుల్ ఫేస్ వాడిపోయిన కొత్తిమీర కట్టలా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతే కాదు రకుల్ అసలు ఇప్పుడు చూడడానికి బాగోలేదు ..గతంలో బొద్దుగా ఉన్నప్పుడే చక్కగా ఉంది . ఇలా అవకాశాల కోసం కడుపు మాడ్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటూ ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు. ఏది ఏమైనా సరే రకుల్ ప్రీత్ సింగ్ హెల్త్ పై కాన్సెంట్రేషన్ చేసి మళ్లీ పూర్వ అందం తెచ్చుకోగలిగితే బాగుండు అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news