Movies"నీ తీరు మార్చుకొ రా అబ్బాయ్"..కొంప ముంచేసిన బన్నీ పరసనల్ వీడియో.....

“నీ తీరు మార్చుకొ రా అబ్బాయ్”..కొంప ముంచేసిన బన్నీ పరసనల్ వీడియో.. !!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెటిజెన్స్ స్టార్ సెలబ్రిటీస్ వీలైనంత ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. అవసరం ఉన్నా.. అవసరం లేకపోయినా.. తప్పు చేసిన ..తప్పు చేయకపోయినా సరే కావాలనే కొందరు స్టార్ సెలబ్రిటీస్ ను టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. పాపం అలాంటి వాళ్లకు బలైపోయాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ . మనకు తెలిసిందే అల్లు అర్జున్ కొంచెం సమయం దొరికిన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటారు . దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కొత్త ఉత్సాహం నింపుతూ ఉంటారు . ఈ క్రమంలోని నిన్న తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా వీడియో పోస్ట్ చేసి ఆమెకు విషెస్ అందించారు .

అయితే ఈ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీగా మారాయి . దీంతో సోషల్ మీడియాలో ఆయన ను ట్రోల్ చేస్తున్నారు జనాలు . సోమవారం కూతురు అల్లు అర్హా పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఓ వీడియో షేర్ చేస్తూ..” తమ ఇంటి కింద ఫ్లోర్లో కందిరీగలు ఉన్నాయని ..అవి కుడుతున్నాయని ..కంగారుపడుతూ అర్హ చాలా ముద్దు ముద్దుగా క్యూట్గా చెబుతున్న” వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఆ వీడియోలో బన్నీ ..తన కూతురు తెలంగాణ భాషలో మాట్లాడుతున్నందుకు కోప్పడినట్లు తెలుస్తుంది .

బన్నీ ..అర్హ మాటలకు రిప్లై ఇస్తూ “తెలంగాణ భాష నా” అంటాడు . దీంతో ఆ లైన్ ను పట్టుకున్న తెలంగాణ ఫ్యాన్స్ బన్నీపై మండిపడుతున్నారు. ” నీకు తెలంగాణ అమ్మాయి కావాలి ..ఆ అమ్మాయి ఇచ్చిన పిల్లలు కావాలి ..తెలంగాణలోనే ఇల్లు కట్టుకున్నావ్.. తెలంగాణలో సినిమాలు రిలీజ్ చేస్తున్నావ్ ..కోట్ల ఆస్తి సంపాదిస్తున్నావ్. మరి నీ పాప తెలంగాణ భాష మాట్లాడితే తప్పా” అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు నీ తీరు మార్చుకోకపోతే ఇబ్బందుల్లో పడతావు.. తప్పంతా మీ ఆలోచన విధానంలోనే ఉంది ..తెలంగాణ భాష అంటే ఎందుకు అంత చిన్న చూపు ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో అల్లు అర్హ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news