బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా లైఫ్ లేని కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తో ఎంతోమంది టాలెంటెడ్ ఉన్న కమెడియన్సుకు సరికొత్త రూట్ చూపించి లైఫ్‌లో సెటిల్ చేసింది . ఈ క్రమంలోనే జబర్దస్త్ షో చెప్పుకొని కార్లు , బంగ్లాలు కొనుక్కున్న కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు . అంతేకాదు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయి పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు. ఆ లిస్టులోకే వస్తాడు ఆనంద్ . జబర్దస్త్ కమెడియన్ గా ట్యాగ్ వేసుకొని పాపులారిటీ సంపాదించుకున్న ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
వల్గారిటి లేకుండా పంచెస్ వేస్తూ జనాలను హెల్తీ కామెడీతో నవ్వించడంలో ఈయన స్పెషాలిటీ . కాగా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ప్రజెంట్ ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ముఖ్యంగా చంద్ర ని ఓ రేంజ్ లో పొగిడేశారు. ఆయన మాట్లాడుతూ..”చంద్ర ఉన్న సమయంలో మేము జబర్దస్త్ లో ఉన్నామని ఆనంద్ తెలిపారు . అంతేకాదు నేను , చమ్మక్ చంద్ర చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని ..నన్ను కమెడియన్ గా చమ్మక్ చంద్ర చాలా ఎంకరేజ్ చేశారని చెప్పుకొచ్చాడు”.
” అంతేకాదు ఒకానొక టైంలో తన టీంలో నన్ను మెయిన్ హెడ్‌గా పెట్టుకోవడానికి ఆఫర్ ఇచ్చారని ..అయినా నాకు టీం లీడర్ గా ఉండడమే ఇష్టం అని అందుకే కొంతమందితో అయినా సరే టీం లీడర్ గా ఉండడానికి ఇష్టపడ్డాను అని చెప్పుకొచ్చారు. కాగా ఇదే క్రమంలో కొందరు చంద్రన్నకు క్యాస్ట్ పిచ్చి అని తెలంగాణ వాళ్ళను మాత్రమే సపోర్ట్ చేస్తారని కొన్ని న్యూసులు వైరల్ అయ్యాయి . అలాంటివాళ్లను చెప్పు తీసుకొని కొట్టాలి ..ఎందుకంటే చంద్రన్న మనస్తత్వం అలాంటిది కాదు . తనకున్న దాంట్లో సగానికి పైగా జనాలకి ఖర్చు చేసే చంద్రన్న జబర్దస్త్ కమెడియన్లకే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు . టాలెంట్ ఉంటే సరే ఎలాంటి వారినైనా ప్రోత్సహించడంలో చంద్ర నెంబర్ వన్ ..మంచి మనసున్న మనుషులలో చంద్ర కూడా ఒకరు “అంటూ చెప్పుకొచ్చారు . ఇలా కులం పిచ్చి అంట కట్టి చంద్రన్న పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిని ఎప్పటికీ వదలను అంటూ ఘాటుగా స్పందించారు.