నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `గౌతమిపుత్ర శాతకర్ణి` ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బాలయ్య సినీ జీవితం లోనే అత్యంత సూపర్ హిట్ సినిమా గ నిలిచింది. ఓ హిస్టారికల్ మూవీని క్రిష్ కేవలం 79 రోజుల్లో తెరక్కేకించిన విధానం యావత్ టాలీవుడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రెండవ భాగం తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట క్రిష్. ప్రస్తుతం మణికర్ణిక సినిమాను డైరెక్ట్ చేస్తోన్న క్రిష్ ఈ సినిమా తర్వాత శాతకర్ణి 2ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇక శాతకర్ణి 2 లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. శాతకర్ణికి కొనసాగింపు భాగం కాబట్టి శాతకర్ణి -2 అనే టైటిల్ పెడతారా? లేక ఇంకేదైనా టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి తనయుడు పులోమావి రాజుగా మారే క్రమంలో ఈ కథ ఉంటుందట. పులోమావి ప్రేమకథ, అతడి ధీరత్వం, అతను రాజుగా మారె క్రమం, యుద్ధ సన్నివేశాలు మొదలైనవి రెండవ భాగం లో ప్రధాన అంశాలుగా ఉండవచ్చని సమాచారం.
క్రిష్ కథ కూడా రాసుకున్నడని ఆ కథ కి తుది మెరుగులు దిద్దె ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.
ముందుగా పులోమావీ పెద్దవాడు కావడం,అతడు రాజుగ మారె క్రమం వరకు బాలయ్య కూడా సినిమాలో ఉంటాడట. ఆ తర్వాత ఇక మోక్షజ్ఞ కథతోనే సినిమా అంతా నడుస్తుందని సమాచారం. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ మూవీని తెరకెక్కించేందుకు ఇప్పటికే వారాహి చలనచిత్రం వారు సిద్ధంగా ఉన్నారట. ఇక భవ్య క్రియేషన్స్ వెనిగల్ల ఆనంద్ ప్రసాద్ క్రిష్ తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు. మరి వీరిద్దరిలో క్రిష్ ఏ బ్యానర్లో ఈ సినిమా తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక బాలయ్య కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తెరక్కేకించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.