బాలీవుడ్ బడా హీరోయిన్ కత్రినా కైఫ్ ఈమధ్యనే తాను ప్రేమించిన హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది . గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే పెద్దలను ఒప్పించి గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకుంది . కాగా కత్రినా పెళ్లి టైంలో నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక్క ఫోటో బయటకు రాకుండా కత్రినా జంట చేసిన ఓవరాక్షన్ ఇప్పటికీ వైరల్ గానే మారుతుంది. అంత ఎందుకు ఈ ముద్దుగుమ్మని ఆదర్శంగా తీసుకొని ప్రజెంట్ హన్సిక కూడా అదే ప్లాన్ ను ఫాలో అవుతుంది .
కాగా పెళ్లి తర్వాత భర్తతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కత్రినా రీసెంట్గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాని బయటపెట్టింది. కత్రినా మాట్లాడుతూ..” పెళ్లి తర్వాత నా లైఫ్ చాలా బాగుంది .విక్కీ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మా అత్తమామలు కూడా నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటారు .నన్ను ఒక కూతుర్ల ట్రీట్ చేసే పద్ధతి నాకు నచ్చింది . మా పెళ్ళి కూడా మేము అనుకున్నట్లు చాలా గ్రాండ్గా సాంప్రదాయ బద్దంగా జరిగింది . అంతా బాగానే ఉన్నా మా పెళ్లి పందిట్లో ఓ ఇన్సిడెంట్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను”.
” పెళ్లి పందిట్లో మా పెళ్లి అయిపోయింది. ఫోటోలు దిగుతున్నాం.. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నాం ..ఈ క్రమంలోనే నా వెనకాల నుంచి గట్టిగట్టిగా అరుపులు సౌండ్లు ఏంటా అంటూ తిరిగి చూసేసరికి ..అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది . చెప్పులు విసురుకుంటూ జుట్టును పట్టుకొని కొట్టుకుంటున్నారు . వాళ్లలో నా చెల్లెలు .. విక్కీ స్నేహితుడు కూడా ఉన్నారు. ఆ గొడవ ఎందుకు జరిగింది చివరిగా ఫైట్లు ఎవరు గెలిచారు అన్నది మాత్రం నేను వాళ్ళని అడగలేదు . పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది “. ప్రజెంట్ కత్రినా టైగర్ త్రీ ,మేరీ క్రిస్మస్ ,జిలే జరా సినిమాలు చేస్తుంది . విక్కి కౌశల్ గోవిందా నామ్ మేర, సామ్ బహుదూర్ చిత్రాల్లో కనిపించనున్నాడు.