శ్రద్ధాదాస్.. ముంబైలో పుట్టి పెరిగిన శ్రద్ద అక్కడే తన చదువులను కూడా పూర్తి చేసింది. చిన్నతనం నుంచే నటి అవ్వాలని భావించిన శ్రద్ద గ్రాడ్యువేషన్ పూర్తవగానే థియటర్స్ కూడా చేసింది. ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్ షాప్స్ కి కూడా అటెండ్ అయ్యేది. ఆమెతో పాటు ప్రముఖ నటులైన పీయూష్ మిశ్ర, చిత్తరంజన్ గిరి వంటి నటులు కూడా ఆ వర్క్ షాప్స్ కి అటెండ్ అయ్యేవారు. ప్రింట్ ప్రకటనల్లో కూడా పోజులు ఇచ్చింది. ఇక ఎంతో మంది ముంబై హీరోయిన్స్ అవకాశాలు ఇచ్చిన మన తెలుగు ఇండస్ట్రీ శ్రద్దకు సైతం మొదటి అవకాశం ఇచ్చింది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాలో మొదట నటించింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి ఆరు నెలల్లోనే చాల సినిమాలు ఆమెకు క్యూ కట్టాయి. 18, 20 లవ్ స్టోరీ, డైరీ, అధినేత, ఆర్య 2 సినిమాల్లో సైన్ చేసిన శ్రద్ధ చిన్న పాత్రల్లో సైతం మెరిసింది. హీరోయిన్ గా ఉండాలని అనుకోకుండా వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకుంది. ఈ కారణం వల్ల కూడా ఆమె స్టార్ హీరోయిన్ అవ్వలేదని అనుకోవచ్చు. 12 ఏళ్ళ క్రితం సాయి ఓం ఫిలిమ్స్ లాహోర్‌తో హిందీలో డెబ్యూ చేసింది. కెరీర్ మొత్తంగా చూసుకుంటే తెలుగు, కన్నడ, బెంగాలీ మరియు హిందీ సినిమాల్లో దాదాపు ముప్పై సినిమాల వరకు చేసింది.
సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ తో పాటు వివాదాలు కూడా త్వరగానే చుట్టుముడతాయి. ఇక శ్రద్ద విషయానికి వస్తే టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తో ఆమె నడిపిన ప్రేమాయణం అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. 2010 లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన మరో చరిత్ర లో హీరోయిన్ పాత్రలో కాకపోయినా ఒక మంచి గుర్తింపు ఉన్న పాత్రలో నటించింది శ్రద్ద. అప్పటి నుంచి వారి పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారింది. 2011లో వీరి ప్రేమ గురించిన వార్తలకు జోరందుకుంది.
కానీ ఈ ప్రేమ పెళ్లి గా మారడానికి అడ్డుపడింది వరుణ్ సందేశ్ పేరెంట్స్ అంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి. ఈ విషయం లో చాల ఏళ్లకు శ్రద్ద దాస్ వివరణ ఇచ్చింది. తాను వరుణ్ కొన్ని రోజుల పాటు ప్రేమించుకున్న విషయం నిజమే కానీ అతడితో బ్రేకప్ పూర్తిగా తన నిర్ణయం అంటూ బాంబ్ పేల్చింది.
వరుణ్ సందేశ్ తల్లిదండ్రులు చాల మంచి వారని తనకు వరుణ్ కి కొన్ని విభేదాలు రావడం తో విడిపోయామని స్పష్టం చేసింది.
ఇక వరుణ్ తో శ్రద్ద దాస్ బ్రేకప్ తర్వాత తన కో స్టార్ అయిన వితిక షేరుతో ప్రేమలో పడ్డాడు వరుణ్. ఈ జంట 2015లో పెళ్లి చేసుకోగా, బిగ్ బాస్ లో కపుల్స్ గా పాల్గొని బాగా పాపులర్ అయ్యారు. శ్రద్ద దాస్ మాత్రం ఇప్పటికి సినిమాల్లో బిజీగానే ఉంటూ ఒంటరిగానే ఉంది. ఇక పై తనకు ప్రేమ లాంటి రిలేషన్స్ వద్దని, తనను అర్ధం చేసుకునే అబ్బాయి దొరికితే డైరెక్ట్ గా పెళ్లి చేసుకొని.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలనీ అనుకుంటున్నానని తెలిపింది శ్రద్ద దాస్.