Moviesజబర్దస్త్ కమెడియన్ గుట్టురట్టు..రెండో పెళ్లి చేసుకునేసాడురోయ్..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!?

జబర్దస్త్ కమెడియన్ గుట్టురట్టు..రెండో పెళ్లి చేసుకునేసాడురోయ్..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు . ఒకప్పుడు తిండికి అల్లాడిపోయిన కమెడియన్స్ ఇప్పుడు జబర్దస్త్ పుణ్యమా అంటూ కారులో ..బంగ్లాలో తిరుగుతూ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అలాంటి ఓ మార్పులు తీసుకొచ్చింది ఈ జబర్దస్త్ షో. అయితే కొందరు కమెడియన్స్ అన్నం పెట్టిన షో ని వెన్నుపోటు పొడుస్తూ పక్క ఛానల్ షో లో రాజ్యమేలుతున్నారు .అంతేకాదు అన్నం పెట్టిన షో ని వేలెత్తి చూపిస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు .

దీంతో ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ రెండో పెళ్లి అంటూ బిగ్ బాంబు పేల్చాడు. దీంతో ఒక్కసారిగా జబర్దస్త్ కామెడీయన్స్ షాక్ అయిపోయారు. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్ రెండో పెళ్లి అంటూ స్వయాన పోస్ట్ పెట్టింది కూడా జబర్దస్త్ కామెడీయన్ నే కావడం ఇక్కడ మరింత షాకింగ్ గా అనిపించింది.

మనకు తెలిసిందే జబర్దస్త్ కామెడీ షో లో పంచ్ ప్రసాద్ తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ ఎదుటి వాళ్ళకి పంచ్ కౌంటర్ ఇస్తాడు. తనని ఎవరైనా సరే ఒక మాట అన్నా దానికి డబల్ బౌన్స్ అవుతూ పంచులు వేయడంలో పంచ్ ప్రసాద్ తర్వాతే ఎవరైనా దీంతో అతడికి పంచ్ ప్రసాద అంటూ టాగ్ లైన్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో పంచ్ ప్రసాద్ కి అతని భార్యతో మళ్లీ పెళ్లి జరిపించారు .

అయితే దీన్నే క్యాష్ చేసుకున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పంచ్ ప్రసాద్ కి రెండో పెళ్లి అంటూ ధంబ్ నైల్స్ క్రియేట్ చేసి వ్యూయ్స్ కోసం ట్రై చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో యాడ్ చేశాడు . దీనితో ఒక్కసారిగా పంచ్ ప్రసాద్ నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ అభిమానులు షాక్ అయిపోయారు . తీరా అసలు మ్యాటర్ చూస్తే పంచ్ ప్రసాద్ శ్రీదేవి డ్రామా కంపెనీలో భాగంగా ఆయన భార్యను రెండోసారి పెళ్లి చేసుకున్నాడు . మరోవైపు దీనిపై జనాలు మండిపడుతున్నారు . జబర్దస్త్ టీం నే కావాలని ఇలా క్రియేట్ చేయిస్తుందని వ్యూస్ కోసం పాపులారిటీ కోసం జబర్దస్త్ ఈ మధ్య మరింత దిగ జారిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఒక్కసారిగా పంచ్ ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news