Moviesబిగ్ బాస్ హౌస్ లో బూతు పురాణం..హవ్వ..అంత తప్పుడు మాట అనేశాడు...

బిగ్ బాస్ హౌస్ లో బూతు పురాణం..హవ్వ..అంత తప్పుడు మాట అనేశాడు ఏంట్రా బాబు..ఏడ్చేసిన గీతు..!!

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ ని సిక్స్ కొనసాగుతుంది . ఈ క్రమంలోనే హౌస్ లోని కంటెస్టెంట్ పేర్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతున్నాయి . మనకు తెలిసిందే బిగ్ బాస్ అంటేనే నాటకం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించే రియాలిటీ షో అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు , జనాలు ఏంటి ఇప్పటివరకు బిగ్బాస్ సీజన్ లోకి వెళ్లి గెలిచి వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు .

 

బిగ్ బాస్ వల్ల ఒరిగింది ఏం లేదని అక్కడ జరిగేది ఒకటి చూపించేది ఒకటి అంటూ పబ్లిక్ గానే కామెంట్స్ చేశారు . కాగా సీజన్ సిక్స్ లోనూ అలాంటి డ్రామాలు చాలా జరుగుతున్నాయి . రీసెంట్గా ఈవారం కెప్టెన్సీ టెస్క్ లో భాగంగా హౌస్ లో చాలా సీరియస్ వార్ నడుస్తుంది , ఎవరికి వారు తమ శక్తిని మించి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ ఇష్టమైన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు .ప్రతిసారి డల్ గా ఉండే కీర్తి కూడా ఈసారి తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అంటూ రంగంలోకి దూకింది. కాగా ఈ టాస్క్ లో భాగంగానే ఎప్పుడు యాక్టివ్ గా ఉండే గీతును అందరూ టార్గెట్ చేశారు.

దీంతో టాస్ కులో ఎలాగైనా సరే ముందు ఉండాలని ప్రయత్నిస్తూ గీత ఫైర్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆటలో కోపాలు గొడవలతో పాటు టంగ్ కూడా స్లిప్ అయింది. టాస్క్ లో భాగంగా గీత నీ అబ్బా అంటూ నోరు జారింది. ఆ మాటను ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు నా స్లాంగ్ అంతే అని.. బై మిస్టేక్ అలా వచ్చేసిందని సారీ కూడా చెప్పింది . అయితే మరోవైపు రేవంత్ కూడా నీ అమ్మ అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. రేవంత్ మాత్రం తన మాటకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వారం నాగార్జున రేవంత్ కు ఎలాంటి క్లాస్ పీకుతాడో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

మరి ముఖ్యంగా ఈ టాస్క్ లో గీతు, ఆది బుట్టలో చేపలు తక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే గీతుకు ,రోహిత్, మేరీనాకు మధ్యన జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ.. తను కావాలనే రెచ్చగొట్టాలని అది గేమ్ కోసమే అంటూ గీత ఓపెన్ అప్ అయిపోయింది . ఇంతవరకు హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి గీత ఎప్పుడు ఏడవలేదు ఇదే ఫస్ట్ టైం. దీంతో వీడియో వైరల్ గా మారింది . ఏదేమైనా సరే ఫైనల్ డేట్ దగ్గర పడే కొద్ది బిగ్ బాస్ హౌస్లో బూతు పురాణాలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news