“దివాళి.. సెలబ్రేషన్ ఆఫ్ లైట్స్” ఈ పండుగ కోసం చిన్నపిల్లలు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు. మిగతా పండుగలు అన్నింటికి ఈ పండగకి తేడా ఏంటి అంటే.. ఈ పండగ నాడు పిల్లలు క్రాకర్స్ కాల్చుకోవడానికి ఇష్టపడతారు. అందుకే చిన్న పిల్లలకి దీపావళి అంటే ఎంతో ఇష్టం.. దాని కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తారు . కాగా అందరికీ క్రాకర్స్ కొనుక్కునే స్తోమత ఉండదు .
కొందరు దీపాలు వెలిగించి సరిపెట్టుకుంటారు. అయితే అలాంటి వాళ్ల కోసం అల్లు అర్జున్ ఎప్పుడు కూడా ఓ పని చేస్తాడట. ఈ అలవాటు తనకి తన సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి దివాళికి ఇలా చేయటం స్టార్ట్ చేసారట. పేద పిల్లలకి అనాధ పిల్లలకి క్రాకర్స్ పంచుతూ వాళ్ల హ్యాపి నెస్ చూసి ఎంజాయ్ చేస్తారట. ఈసారి కూడా అల్లు అర్జున్ అదేవిధంగా క్రాకర్స్ పంచాలని డిసైడ్ అయ్యి అనాధ శరణాలయానికి.. రోడ్డుపై ఎవ్వరూ లేకుండా ఉన్న పిల్లలకి క్రాకర్స్ పంచడానికి సిద్ధపడ్డాడు.
నిజానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమందికి కోట్ల ఆస్తులు ఉన్నాయి . కానీ చాలా తక్కువ హీరోలు మాత్రమే ఇలా పేద పిల్లల గురించి ఆలోచిస్తారు. ఆ వరుస లో ముందు ఉంటాదు అల్లు అర్జున్. ప్రతి ఏడాది తనకు తోచిన విధంగా పిల్లల్ని సంతోష పెట్టడానికి చూస్తాడు ఈ రియల్ హీరో.. ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ లాంటి గొప్ప హీరో మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గ్రేట్ అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.