Moviesకెరీర్ లో అంజలి మరో చెత్త నిర్ణయం..ట్రెండింగ్ లో తెలుగు హీరోయిన్..!!

కెరీర్ లో అంజలి మరో చెత్త నిర్ణయం..ట్రెండింగ్ లో తెలుగు హీరోయిన్..!!

ఏంటో ఈ కాలం హీరోయిన్స్ తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. తప్పుటడుగులు వేసి మాత్రం కెరియర్ నాశనం చేసుకుంటున్నారు . ఇప్పటికే అలాంటి చెత్త పనులు చేసి బోలెడు మంది హీరోయిన్స్ తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాగా రీసెంట్ గా అదే లిస్టు లోకి యాడ్ అయినట్లు తెలుస్తుంది మన తెలుగు అమ్మాయి అంజలి.

అంజలి ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్లో సినిమా అవకాశాలు దక్కించుకొని.. అక్కడ పాపులారిటీ సంపాదించుకొని …తమిళ్లో వచ్చిన పాపులారిటీ కారణంగా తెలుగులో అవకాశాలు దక్కించుకుని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,జర్నీ ,గీతాంజలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది .

అంతేకాదు రీసెంట్ గా వచ్చిన మాచర్ల నియోజకవర్గ సినిమాలో ఐటెం సాంగ్ చేసి హాట్ ఐటమ్ గర్ల్ అనే పేరును దక్కించుకుంది అంజలి . ఇదివరకు కూడా సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్ లో నటించింది ..కానీ ఆ సాంగ్ కన్నా రారా రెడ్డి సాంగ్ లో ఆమె అందాలు ఎక్కువగా ఆరబోసింది. దీంతో అంజలి కి హాట్ ఐటమ్ గార్ల్ అంటూ ట్యాగ్ వేశారు. కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో అంజలి మరో ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ ప్రొడ్యూసర్ ఆమెకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అన్న కృతజ్ఞతతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇలా కెరియర్ పిక్స్ కి వెళ్తున్న టైం లో ఐటెం సాంగ్స్ కి ఓకే చెప్పడం ఆమె కెరియర్ కి మైనస్ అవుతుంది అంటున్నాడు సినీ విశ్లేషకులు. చూడాలి అంజలి ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news