Moviesజెనీలియా జీవితంలో ఇన్ని కాంట్రోవర్సీలా... ఆ స్టార్ హీరోతో పెళ్లి పుకార్లు...

జెనీలియా జీవితంలో ఇన్ని కాంట్రోవర్సీలా… ఆ స్టార్ హీరోతో పెళ్లి పుకార్లు కూడా…!

హీరోయిన్ జెనీలియా.. హ హ హాసినిగా, అల్లరి పిల్లగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్ కి తుజే మేరీ కోసం అనే హిందీ సినిమా ద్వారా తొలిసారి గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె పూర్తిగా తెలుగు, తమిళ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ మొత్తం మీద హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలో నటించగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఆమె హావా కొన్నాళ్ల పాటు కొనసాగింది. బొమ్మరిల్లు సినిమాకు గాను ఆమె మొదటి ఫిలిం ఫేర్ అవార్డు సైతం దక్కించుకుంది. 2012లో తన మొదటి సినిమా హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లల తల్లిగా మారింది. అలాంటి జెనీలియా జీవితంలో అనేక కాంట్రవర్సీలు ఎదుర్కొంది. ఆమె లైఫ్‌లో ఎదుర్కొన్న‌ కాంట్రవర్సీలు ఏంటో తెలుసుకుందాం.

IIFA కాంట్రవర్సీ :
2010 లో కొలంబోలో జరిగిన IIFA అవార్డ్స్ కి హాజరవ్వడం చాల పెద్ద కాంట్రవర్సీ గా మారింది. ఆ సమయంలో తమిళనాడుకు చెందిన అనేక మంది సామాన్యులను ఎల్టీఈకి చెందిన వారీగా గుర్తించి శ్రీలంక ప్రభుత్వం కాల్చి చంపడంతో సౌత్ ఇండియా నటీనటులు, బాలీవుడ్ నటులు ఈ అవార్డు ఫంక్షన్ ని బాయ్ కాట్ చేశారు. ఈ విషయం తెలియడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ గా ఉన్న రితేష్ కొలంబోలో మీడియా కంట పడ్డాడు. ఇద్దరు కలిసే కొలంబోకి వెళ్లినట్టుగా కూడా రూమర్స్ వచ్చాయి. ఇక ఈ సమయంలోనే జెనీలియాను అన్ని సినిమా ఇండస్ట్రీ ల నుంచి బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. కొన్నాళ్ల పాటు తమిళ ఇండస్ట్రీ ఆమెను అక్కున చేర్చుకోలేదు.

జాన్ అబ్రహంతో పెళ్లి…
ఇక జాన్ అబ్రహంతో ఫోర్స్ అనే సినిమాలో నటించింది జెనీలియా. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా పెళ్లి సీన్ షూట్ రియాలిటీకి దగ్గర గా ఉండాలని భావించిన సినిమా యూనిట్ నిజమైన పండితుడితో పెళ్లి షూట్ చేసారు. ఇక మంత్రాలతో పాటు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా సాంప్రదాయ పద్దతిలో జరిపించారు. అది షూటింగ్ అని తెలియాని సదరు పండితుడు జెనీలియా రితేష్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయినా తరుణంలో ఆమెపై కేసు పెట్టాలనే ప్రయత్నం చేసాడు. జెనీలియా కు నేనే పెళ్లి చేశాను కానీ ఆమె మరొక పెళ్లికి రెడీ అయ్యింది అంటు ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్లి మరి గొడవకు దిగాడు. అప్పట్లో ఈ వార్త బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రచారం…
జెనీలియా టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సమయంలో అనేక సంస్థలకు బ్రాండ్ అంబాజిడర్ గా పని చేసింది. అయితే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రచార కర్తగా వ్యవహరించింది. యాడ్స్ లో, పత్రికల్లో జెనీలియా ఫోటో వేసి సదరు కంపెనీ ప్ర‌చారం చేయగా అనేక ఫ్లాట్స్ కూడా అమ్ముడుపోయాయి. కానీ కోట్ల రూపాయలు వెనకేసుకున్న తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పడంతో బాధితులు ఆ కంపెనీ తో పాటు ప్రచారం చేసినందుకు జెనీలియా పై కూడా కోర్ట్ కి ఎక్కారు. ఇలా తనకు సంబంధం లేకపోయినా జెనీలియా ఈ వివాదంలో ఇరుక్కుంది. వీటితో పాటు రితేష్ తో ప్రేమ, పెళ్లి వ్యవహారంలో సైతం ఆమె ఎప్పుడు వార్త వస్తువుగా మారుతూ ఉండేది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news