Gossipsసెన్సార్ టాక్ ... ఎలా వుందో ?

సెన్సార్ టాక్ … ఎలా వుందో ?

ఒక్క‌టంటే ఒక్క క‌ట్ లేకుండా సినిమా విడుద‌ల‌కు నోచుకుంటే ఇటీవ‌ల కాలంలో గ్రేట్‌.. ఆ విధంగా రాజా ద గ్రేట్‌. ప‌టాస్ ఫేం అనీల్ రావిపూడి ద గ్రేట్‌. క్లీన్ యూ స‌ర్టిఫికెట్ పొంద‌ని ఆనందంలో ఉన్న మాస్ మ‌హారాజా చిత్రం అంద‌రినీ అల‌రిస్తుంద‌ని, దీపావ‌ళికి బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

సెన్సార్ గ‌డ‌ప సునాయాసంగా దాటేయ‌డంతో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 18న ఘనంగా విడుదల కావడానికి చిత్రం సిద్ధమవుతోంది.అదేవిధంగా నిన్న‌టి వేళ విడుద‌లైన ట్రైల‌ర్ కూడా భ‌లే ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. దీంతోపాటు తమిళ హిట్‌ ‘బోగన్‌’ రీమేక్‌లోనూ రవితేజ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారని ఇండ‌స్ట్రీ టాక్. 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news